పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

గ్రామ కైఫీయత్తులు


తదనంతరం అనుమకొండ్డ సింహ్మసనాధీశ్వరుడైన ప్రతాపరుద్రమహారాజులుంగారి ప్రభుత్వం శాలివాహనం ౧౨౪౨ శకం (1320 A D) వర్కు జరిగిన మీదట రెడ్లు బలవంత్తులు అయి ప్రభుత్వంచెశెటప్పుడు వేమారెడ్డి రాచవెన్ను మొదలయిన ఆరుగురు రెడ్లు ప్రభుత్వం చెశెటప్పుడు కొవూరి పోలినేడు అనె మజ్కూరి కాపు శ్రీచంన్న కేశవస్వామి శ్రీ చంన్న మల్లెశ్వర స్వామివాల౯ యొక్క ఆలయములు జీనూ౯ద్దారం చెయించ్చి పునహ ప్రతిష్ట చెయించి స్వామివాల౯కు నిత్యనై వైద్య దీపారాధనలకు జర్గడానకు మజ్కూరి పొలములో చెశ్ని వృత్తులు. శ్రీచంన్న కెశవస్వామివారికి కు ౨ శ్రీచంన్న మల్లేశ్వరస్వామివాల౯కు కు౨ వెరశి నాలుగు కుంచళ్లు యినాములు యిప్పించ్చి సకలొత్సవములు జర్గించ్చినారు. శాలివాహనం ౧౩౪౨ (1420 A D) వర్కు రెడ్లు ప్రభుత్వము చెశ్నిమీదట తిర్గి గజపతులు దేశం ఆక్రమించ్చుకొని లాంగూల గజపతి, పురుషోత్తమ గజవతి, వ్రతాపరుద్ర గజపతి ప్రభుత్వం చెశ్నిమీదట ప్రతాపరుద్ర గజపతి కొమారులైన వీరభద్రగజపతి కొండ్డవిడు రాజధానిగా యెప౯రుచుకొని ప్రభుత్వం చెస్తూ వుండ్డగా నరపతి సింహ్వాసనస్తుడైన శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వరుడైన కృష్ణదేవమహరాయలు విజయనగరమణద్దు రత్నసింహ్వాసనస్తుడై పృధివి రాజ్యం చేస్తుంన్నూ ద్విగ్విజయాధ౯ం బయలుదేరి తూపు౯దెశాన్కు వచ్చి గజపతి వార్ని జయించ్చి శాలివాహనం ౧౪౩౭ (1515 AD) శకమంద్దు కొండ్డవీటి దుగ౯ం ముట్టడిచేశి వీరభద్ర గజపత్ని పట్టుకొని దేశం ఆక్రమించ్చుకొని దుగ౯ం వుంచ్చుకొని కృష్ణరాయులు, అచ్యుతరాయులు, సదాశివరాయులు, శ్రీ రంగ్గరాయులు మొదలైనవారు ప్రభుత్వం చెశె యడల మజ్కూరిలో వుండ్డె స్వామివాల౯కు నిత్యనైవేద్య దీపారాధన మొదలైన వుత్సవములు యున్నతముగా జరిగించ్చినారు. శా ౧౫౦౨ (1580 AD) వర్కు మల్కి విభురాం పాదుషాహగారు కనా౯టక పాదుశాహాలైన శ్రీ ర౦గ్గరాయులును జయించ్చి కొండ్డవీటి దుగ౯ం పుచ్చుకొని ప్రభుత్వం చెశ్ని మీదట యితని కొమారుడైన మహమ్మదు పాదుశహవారు ప్రభుత్వం చెశెటప్పుడు ఆమీను ముల్కా వార్కి యీదేశాన్కు ప్రభుత్వం యిచ్చినారు గన్కు అతని వ్యవహారములో మతద్వేషం చాతను ప్రభలమైన దేవ స్తళములు పడకొట్టించ్చి మశీదులు దరగాలు కట్టించ్చుకొనిపోయినారు. ఆసమయమంద్దు చంన్న కేశవస్వామివార్ని ఆచ౯కులు మూలవిగ్రహమ్ను వుత్సవవిగ్రహమ్ను భూస్థాపనం చెయించినారు. తదనంత్తరం కొండ్డవీటి సముతు బంద్దెలు చెశెటప్పుడు యీవుప్పలపాడు నాదెండ్ల సముతులలో దాఖలు చెశినారు. సముతు ఆమీలు చపుదరుదెశ పాండ్యాలు పరంగ్గా స్న ౧౧౨౦ (1710 AD) ఫసలీ వర్కు అమీని మామిలియ్యతు జర్గించ్చినారు స్న ౧౧౨౨ (1712 AD) ఫసలీలో సుభావారు కొండ్డవిటి శీమవంట్టు చెశి జమీదార్లకు పంచ్చి పెట్టి యడల యీ గ్రామం సర్కారు మజుంద్దారుడైన మానూరి వెంక్కన్న పంత్తులుగారి వంట్టులో హవేలీ చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయ్నివి గన్కు వెంక్కంన్న పంత్తులుగారు అప్పారావు పంత్తులుగారు వెంక్క ట్రాయినింగ్గారు ప్రభుత్వంచెశ్ని తర్వాతను నవాబు సాహెబుదాదాగారు షముజుదారి చెశెటప్పుడు వెంక్కట కృష్ణునింగ్గారు చిల్కలూరు పాటి...... జమీదారు చెశెటప్పుడు స్న ౧౧౭౬ (1766 A D) ఫసలి మజ్కూరి కరణాలు వుప్పలపాటి నారాయణప్ప యీ అచ్చు... కాపులుచుండ్డి... పెండ్డెల రమణప్ప మారెళ్ళ పెరయ్య మొద .