పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుప్పలపాడు

91


లైనవారు శ్రీ చంన్న కెశవస్వామివారికి పునహ ఆలయం కట్టించ్చివలెనని ప్రయత్నం చెశి కప్పుమట్టుదనుకా రాయి కట్టించ్చి రాచకియ్యపు తొంద్దరను గురించ్చి కొన్ని వుపద్రవములు వచ్చెనుగన్కు సదరహి పని మోకూపు (?) అయ్నిది. వెంక్కట కృష్ణునింగారు స్న ౧౧౮౪ (1774 A.D.) ఫసలీ వర్కు ప్రభుత్వం చెశిన్నమీదట వీరి కొమారుడైన నర్సంన్నారావు గారు ప్రభుత్వం వహించ్చి వకసంవ్వత్సరం అధికారం చెశ్ని మీదట పయ్ని వ్రాశ్ని అప్పాజీ పంత్తులుగారి కొమారుడయ్ని వెంక్కటేశంరావు గారి వంత్తువచ్చి సత్తెనపల్లి తాలూకాలో దాఖలు ఆయ్నిది. గన్కు వెంక్క టెశంగారి ప్రభుత్వం జరుగుతూవుండ్డగా స్న ౧౧౯౭ (1787 AD) ఫసలీలో మహారాజు రాయనివారు ప్రభుత్వాన్కు గుంట్టూరు సర్కారుకు వచ్చిరి గన్కు స్న ౧౧౯౮ (1788 AD) ఫసలీలో మజ్కూరిలో వడ్రంగ్గ కమ్మరలకు మిరాశీ దారుడైన బండ్డాకట్టు... భద్రయ్య గృహ ఆవరణంలో గోడ పెట్టె నిమిత్తం తొవ్వుతూ వుండ్డగా పూర్వీ... చంన్న కేశవస్వామివారి విగ్రహం దృశ్యం అయినదిగన్కు జల్లిమల్లయ్య అనే సంసారి గృహములు కట్టుకునె నిమిత్తం అయిస్తంభం ప్రతిష్ఠ చాయదలచి తవ్వుతూ వుండ్డగా శ్రీవిష్ణుసంభంధమైన శ్రీచంన్న కేశవస్వామివారి వుత్సవిగ్రహములు అగుపడ్డవి గన్కు మజ్కూరి...... కాపులు స్న ౧౧౯౯ (1789 AD) ఫసలీలో శ్రీచంన్న కెశవస్వామివారి యొక్క ఆలయము పూరాగాకట్టించ్చి స్వామివార్ని ప్రతిష్ఠచేశి పూజించ్చడాన్కు రత్నాకరం పద్మనాభాచార్యులను అచ౯కుని నిన౯యించ్చి నిత్యనైవేద్య దీపారాధనలు జర్గడాన్కు కెశవస్వామికి కు౨ రెండు కుంచ్చళ్ళు భూమి యినాముగా యిచ్చినారు గన్కు కుంఫిణీవారు సదరహి తాలూకా ఆమానిచెశి తిర్గి జమీదాల ౯పరం చెశిరి గన్కు వెంక్క టెశరావుంగారు స్న ౧౨౦౫ (1795 AD) ఫసలీ వర్కు అధికారంచెశ్ని తర్వాతను వీరికొమారుడైన వెంక్కట రమణప్పరావుగారు ప్రభుత్వం వహించ్చి అధికారం చేస్తూవుండ్డగా స్న ౧౨౧౨ (1802 AD) ఫసలీ రుధిరోద్గారి నామసంవత్సరము మజుకూరి కరిణీకులు వుప్పలపాటి సుంద్దర్రాముడు శివాలయం కట్టించ్చవలెనని ప్రయత్నంచేశీ స్న ౧౨౧౯ ( 1809 AD) ఫసలీలో ఆలయం పూరాగా కట్టించ్చి శ్రీశైలమునుంచ్చి తీసికొనివచ్చిన లింగమూత్తి౯ని ప్రతిష్టచెశి శ్రీచంన్న మల్లెశ్వరస్వామివారు అనె పెరుబెట్టి పూజించడాన్కి కూరుపాటి బసవంన్న అనె తపొధనుంణ్ని నిన౯యించ్చినారు. గన్కు నిత్యనై వైద్య దీపారాధనలు జర్గడాన్కు కెసర పాటి కు ౧ కుచ్చళ్ళు యినాములు పెట్టి రమణప్పారావుగారు అధికారంచేస్తూ వుంన్నారు. స్న ౧౨౨౪(1814 AD) ఫసలీ ఆఖరు వరకు రమణయ్యారావుగారు ప్రభుత్వంచెశ్ని మీదట యితని కొమారుడైన వెంక్కట రాయినింగ్గారు పదహారు సంవ్వత్సరములు మైనరులో వుంన్నారు గన్కు ఆనురబుల్ కుంఫిణీవారు మెనెజర్లు అమానీ మామిలియ్యతు జరిగించ్చుకుంట్టు వుంన్నారు. మామిలియ్యతు బెరితజు'...?