పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89

వుప్పలపాడు

కై ఫియ్యతు మౌజే వుప్పలపాడు సంతు నాదెంళ్ల తాలూకె

సత్తినపల్లి యిలాకె రాజామానూరు వెంక్కట్రావు మైనరు

జమీదారు సర్కారు ముతు౯జాంన్నగరు స్న ౧౨౨౭

(1817 AD) ఫసలీ బహుధాన్య నామసంవత్సర వైశాఖ

బ ౧౧ మజ్కురి కరణాలు వుప్పలపాటి సూర్యరాజు సుందర

రామన్న వ్రాయించిది.

పూర్వం యీ స్తళం బహుఅరణ్యం గ్గావుండ్డె గన్కు యీవోంక్కారనది తీరమందు ఆగస్త్య భగవానులు తపస్సు చెశి యీ ప్రదేశమంద్దు చంన్న కేశవస్వామివారు అనే విష్ణు మూత్తి౯ని ప్రతిష్ఠచెశి యీస్వామివారి ఆలయాన్కు దక్షిణ భాగమంద్దు మల్లిఖాజు౯డు అనె లింగ్గమూత్తి౯ని ప్రతిష్ఠచెశినారు. కలియుగం ప్రవేశమయ్ని తర్వాతను అరణ్య ప్రదేశములు గ్రామములు ఆయి రుషిప్రదేశములు గ్రామములు అయినవి. గన్కు యీస్థలమందు గ్రామం యెప౯డి వుప్పలపాడు అనె అభిదానం యెప్ప౯డ్డది. యుధిష్ఠర విక్రమ శకంబులు జర్గిన తరువాతను శాలివాహన శకం ప్రవేశమయ్ని తరువాతను ౧౦౩౫ శకం (1113 AD) లగాయతు కుళోత్తుంగ్గ చోళ మహారాజు ప్రభుత్వం చేస్తూ వుండి మజ్కూరిలో పుండ్డె స్వామి వాల౯కు ఆలయములు నిర్మాణము చేయించి నిత్యనైవెద్య దీపారాధనలకు విశేషముగా స్వాస్తములు చెశినారు అన్నవాడికకలదు. తదనంతరం యీదెశాన్కు గజపతి, సరపతి, అశ్వపతి, అనేవి మూడు సింహ్వసనాలు యెప్ప౯డ్డవి. యింద్దులో గజపతి సింహ్వాసనస్తుడైన విశ్వంభరదేపు ప్రబలుండై ౧౨ పన్నెండ్డు సంవత్సరములు ప్రభుత్వముచెశ్నీ మీద యితని కొమారుడైన గణపతి దేవమహారాజులుంగ్గారు శాలివాహనం ౧౦౫౬ (1134 AD) పట్టాభిషిక్తుడై ప్రభుత్వం చెశెటప్పుడు విరిదగ్గిర మహాప్రధానులైన గోపరాజు రామన్న గారు శాలివాహనం ౧౦౬౭ (1145 AD) అగునెటి రక్తాక్షి సంవత్సర భాద్రపద బ ౩౦ అంగ్గార్క వారం సూర్యగ్రహణకాలమంద్దు కృష్ణానది తీరమంద్దు ప్రభువు దగ్గర దానం పట్టి సమస్తమయ్ని నియ్యోగుల్కు గ్రామ కరిణికపు మిరాశీలు నిన౯యించ్చె యడల యీ గ్రామాన్కు వెలనాడు హరితస గోత్రులైన నీలంరాజు పెద అంద్దెంరాజు అనేవారికి యెక భోగముగా రస్మితేజో పాజు౯నులు(?) తోకూడా మిరాశి నిన౯యించ్చినారు గన్కు తథాది మొదలుకొని యెతద్వంశీకులై నవారు వుప్పలపాటివారినె అభిదానం చాతను అనుభవిస్తూ వుంన్నారు.

తదనంతరం కోట భీమ రాజుగారు దేశం ఆక్రమించుకుని ప్రభుత్వంచేస్తూ వుండ్డగా రాజేంద్ర చోళ మహారాజు చోళదేశాననుంచ్చి యీ దేశానకు వచ్చి భీమరాజును హరించ్చి దెశము ఆక్రమించ్చుకొని శాలివాహనం ౧౦౯ (?) శకం వర్కు ప్రభుత్వం చెశినారు.