పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

వరగాణి


కయిఫియ్యతు మం॥ వరగాణి సం౹౹ గుంట్టురు, తాలూకే

రెపల్లె సర్కారు ముత్తు౯ జాంన్న గరు.

యీ గ్రామాన్కు పూర్వనుంచ్చి వరగాని అనే పేరు వాడికె వుంన్నది. గజపతి శింహ్వసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగ్గారు శా ౧౦౫౬ శకం (1134 AD) మొదలుకొని ప్రభుత్వంచేస్తూ వుంన్న కాలమంద్దు విరిదగ్గర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు శాలివాహనం ౧౦౬౭ శకం (1145 AD) అగు నెటి రక్తాక్షి సంవత్సరం భాద్రపద బ ౩౦ అంగ్గార్క వారం సమస్తమయ్ని నియ్యోగుల్కు గ్రామకరిణ్కిము మిరాశీలు సూర్యోపరాగ గ్రహణకాలమంద్దు తమ ప్రభువులయ్ని గణపతి గజపతిగారి దగ్గర దానం బట్టి యెవరెవరికి యిచ్చెయడల యీ వరగాణికి యెలటూరి (?) వాండ్లు అనే ఆరువెలనియ్యోగుల్కు సంప్రతి ౧కి వరగాణివారు అనే రెండు శుక్లయజుశ్యాఖల్కు సంప్రతి ౧కి వెరశి యీ రెండు సంప్రతులవార్కి మిరాశి నిన౯యించ్చి యీ గణపతి మహారాజులుం గారుంన్ను విరి కుమారులయ్ని కాకతిగణపతిగారు ప్రభుత్వం చేశెటప్పుడు గ్రామస్తులు గ్రామమధ్యమంద్దు దేవస్తానములు కట్టించ్చి శ్రీ చంన్న కేశవస్వామి వార్ని శ్రీ మల్లెశ్వరస్వామి వార్ని ప్రతిష్టలు చెసినారు. గన్కు యీ స్వామివాల్ల౯కు నిత్యనైవెద్య దీపారాధనల్కు జర్గగలందుల్కు మజ్కూరి పొలంలోనూ


 ౧ శ్రీ చంన్న కెశవస్వామి వారికి
       ౧ శ్రీ మల్లేశ్వరస్వామి వారికి
      ———
       ౨ యినాములు
      ———

యిప్పించ్చి శా ౧౨౪౦ శకం (1318 AD) వర్కు ప్రభుత్వం చేశెను.

తదనంతరం రెడ్లు బలవంత్తులై శా ౧౩౪౦ శకం (1418 AD) వర్కు ప్రభుత్వం చెశ్ని తర్వాతను తిర్గి గజపతి వారు తఖ్తు భిఠాయించ్చి శా ౧౪౩౬ శకం (1514 AD) వర్కు ప్రభుత్వం చెశ్ని తర్వాతను కృష్ణరాయలుగారు గజపతి వారిని జయించ్చి తాలుకా తమ పరం చెస్కునిరి గన్కు శా ౧౫౦౦ శకం వర్కు కనా౯ట్క రాజుల ప్రభుత్వం జర్గెయడల సదాశివదేవరాయులవారి అధికారంలో యీ గ్రామం కుమ్మూరి ఆగ స్తేశ్వర స్వామి వార్కి జాగీరి కింద్దను జర్గించ్చినారు.

తదనంత్తరం దెశములు మ్లెచ్చాక్రాంతమయ్ని తర్వాతను కనా౯ట్క ప్రభుత్వములో కొండ్డవిటి కిల్లాలకు హజారినాయకరం కోటకిల్లె దారి హోదాలలో వుండ్డి దానక్షాత్రములేయందు ప్రవీణులైన తిరుమల మాణిక్యరాయ్నింగార్కి యీ ముత్తు౯జాంన్న గరు సర్కార్కు దెశముఖి మంన్నె వారి హోదా నిన౯యించ్చి కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు