పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

గ్రామ కైఫీయత్తులు


కాత్తి౯క అభిషేకములు నిత్యదీపారాధనల్కు
సాలియానా గ్రామఖర్చులో నిన౯ యించ్నింది.
౨౦ శ్రీఅగస్తేశ్వరస్వామి వార్కి
౨౦ శ్రీవల్లభరాయస్వామివార్కి

యీ ప్రకారంగ్గా సాలియానా జరిగెటట్టు యించ్చినారు. తదనంతరం రౌద్రి సప్తకం ప్రభవ పంచ్చకాముని పన్నెండు సంవత్సరములు. మయ్ని క్షామం వచ్చి గ్రామాదులు వుజాడు అయి ప్రజలు దేశగతులు అయిరిగన్కు అప్పట్లో యీ దెవస్తానములు అచ౯నాది కృత్యములు జరగక ఖిలపడ్డవి. వుత్సవ విగ్రహాలు ఆభరణములు మొదలయ్ని వి అక్షామడాంబ్బరములో మయాత్తు అయ్నివి అని చెప్పినారు. తదనంత్తరం క్షామం తిర్ని తర్వాతను దేశం స్వస్తతలో వచ్ని మరికొంన్ని సంవత్సరములకు స్న ౧౧౨౨ (1712 A.D.) ఫసలీలో కొండ్డవీటిశీమ వంట్లు చే జమీదాణా కు పంచ్చి పెట్టె యడల యీ గ్రామం సర్కారు దెశముఖి మంన్నె వారయ్ని రమణయ్య మాణిక్వారాయనింగారి వంట్టు వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యగారు మల్లంన్నగారు శీతంన్నగారు గోపంన్నగారు మొదలయ్ని వాలు౯ స్న ౧౧౬౮ (1758 A.D. ) ఫసలీ వర్కు ప్రభుత్వములు చెశ్ని తర్వాతను స్న ౧౧౬౯ (1759 A. D.) ఫసలీలో పయిన వ్రాశి శీతంన్నగారి కుమారుడయ్ని జంగ్గంన్నా మాణిక్యా రాయినింగ్గారు ప్రభుత్వానకు వచ్చి స్న ౧౧౮౨ (1772 A.D.) ఫసలీ వర్కు ౧౪ సంవత్సరములు ప్రభుత్వం చెశ్ని తర్వాతను తంమ్ములయ్ని తిరుపతిరాయునింగారు సదరహి ఫసలీలో తాలూకా సఖం పంచ్చుకొంన్నాడు గన్కు యీ గ్రామం రెండువంట్లు అయినంద్ను జంగ్గన్నగారి వంట్టు సదరహి వసలీ లగాయతు స్న ౧౨౦౧ (1791 A.D.) ఫసలీ వర్కు పంధొంమ్మిది సంవత్సరములు ప్రభుత్వం చెశి ధర్మవంతుడై బ్రాంహ్మణుల్కు యినాములు యిప్పించి ప్రభుత్వం చేశాను.

అప్పట్లో స్న ౧౧౯౮ (1788 A.D.) ఫసలీలో మహారాజశ్రీ కుంఫిణీవారు గుంట్టూరు సర్కారు ప్రభుత్వాన్కు వచ్చి మూడు సంవత్సరములు తాలూకా అమాని చెశి తిరిగి జమీదాల్ల౯ చెశినారూ పరం

తదనంత్తరం జంగ్గంన్నా మాణిక్యారాయునింగారి కుమారు లయ్ని భావయ్యా మాణిక్యారాయునింగ్గారు పదరహీ ఫసలీలో ప్రభుత్వాన్కి వచ్చి.... ధర్మవంత్తుడై ప్రభుత్వంచెస్తూ స్న ౧౨౦౬ (1796 A.D.) ఫసలీలో వారి పినతంమ్ములు తిరుపతి రాయనింగ్ధారి కుమారులయ్ని శీతంన్నగారు తమకు మజ్కూరిలో వుంన్న శ్రీవల్లభరాయి స్వామి వారికి రావిపాటి కాపరస్తుడయ్ని ధూపాటి రత్నమాచార్యులు గ్రామస్తులు శ్రీ స్వామి వారికి ఆలయంలో .. ..ధారంచెయించ్చి పునః ప్రతిష్టి చేయించిరిగన్కు యీ స్వామి వారికి నిత్యనై వెద్యాన్కు వుండ్డు వంట్లను కు ౫ అయిదు కుచ్చళ్లు మాన్యం యిచ్చినారు.

స్న ౧౨౧౪ (1804 AD) ఫసలీలో భావయ్య మాణిక్యారాయనింగ్గారు అధ౯ తొంద్దరను గురించి వారితాలూకాలో యిరువై రెండు గ్రామాదులు వాశిరెడ్డివారికి తాకట్టుకింద్దను