పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వంగ్గిపురం

75


వుంచ్చిరిగన్కు యీవంగ్గిపురం పెద్దవంట్టు సదరహి గ్రామాదులలో చేరినంద్ను సదరహి ఫసలి లగాయతు చింత్తపల్లి తాలూకా జమీదారుడైన రాజా వెంక్కటాద్రినాయుడుగారిపరంగ్గా అధికారం జరుగుతూ వున్నది.

తిరుపతి రాయునింగ్గారి వంట్టు స్న ౧౧౮౨(1772 AD) ఫసలీ మొదలుకొని ప్రభుత్వంచేస్తూ మజుకూరిలో వుండ్డుకున్న అగస్తేశ్వరస్వామివారికి వారి అంన్నగారయ్ని జంగ్దంన్నగారు వీరి అనుమతిని మజ్కూరి మిరాశిదారుడైయ్ని సంద్దెపూడి లక్ష్మినర్సు మన్మధ సంవత్సరములో ఆలయం జినో౯ ధారం చెయించ్చి పునః ప్రతిష్ట చేయించ్చినారు గన్కు యీదెమున్కి నిత్యనై వైద్య దీపారాధనలకు రెండ్డువంట్లుకు 3 మూడుకుచ్చళ్ళ భూమి యినాము యిప్పించ్చినారు.

తిరుపతి రాయునింగారు వీరికుమారులయ్ని అప్పారాయినింగ్గారు శీతంన్నగారు స్న ౧౨౦౮ (1798 AD) ఫసలీవీర్కు అధికారం చెశి నిస్సంత్తుగా పోయిరి గన్కు జంగ్లంన్నగారి కుమారుడయ్ని భావయ్యగారు స్న ౧౨౦౮ (1799 AD) ఫసలీ మొదలుకొని స్న ౧౨౧౧ (1801 AD) ఫసలీ వర్కు మూడు సంవత్సరములు అధికారం చెశ్ని తర్వాతను స్న ౧౨౧౨ (1802 AD) ఫసలీలో మహారాజశ్రీ కుంఫిణీవారు తాలూకా యాలం వేసినారుగన్కు రాజామల్రాజు వెంక్కట గుండ్డారాయనింగ్గారు కొనుక్కుని సదరహి ఫసలీల గాయతు స్న ౧౨౨౨ (1812 AD) ఫసలీ వర్కు అధికారంచేస్తూ వుంన్నారు. రిమాకు౯ గ్రామగుడికట్టు కుచ్చళ్ళు ముఫయి ఆరు మూర అరపగ్గానను ౩౦౦ b కిమ్ని హాలూ 40 గ్రామకంఠాలు లా కి 0 0 | O తిమ్మావురం 6 6 6 కనుపాగ్రామకంఠం నవుపాడు మల్లపాడు 2.... 75 శ్రీశకవారిపాలెం తూపుక్షా పాలిమెరపుంన్న మాలపల్లె మాదిగెపల్లె దక్షిణపు మాదిగెపల్లె చరువులు కుంట్టలు వగయిరా ౧౨ కి కసుపాలో అంన్నాప్రగడ రాముడు తవ్వించ్ని చెరువు గ్రామాన్కు పడమట. మద్దిపూడి వరదప్ప తవ్వించ్ని చెరువు గ్రామాన్కు అజ్నేయంగావున్నది ౦ 4 - పూర్కి యీశాన్వం గోళ్ళమూడి భావయ్య తవ్వించి చెర్వు.