పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

గ్రామ కై ఫీయత్తులు


తదనం త్తరము యీఅనం త్తదండ్డపాలునిగారు యీస్థలమందు శివప్రతిష్టచెశి ఆగస్తే స్వరుడనె లింగమూత్తి౯ని ప్రతిష్ఠ చెశినారు యిదీపూర్వవృత్తాంతం.


శాలీవాహన శక ప్రవేశమయ్ని తర్వాతను అనుమకొండ్డ పురాధీశుడై నషువంటింన్నీ కాకతీయ శ్రేష్ఠుడైనషువంటింన్నీ ప్రోలరాజుకుమారుడయ్ని ప్రతాపరుద్రుడు ప్రభుత్వాన్కు వచ్చి యీ అగ్రహరములు జరిగించ్ని వారయి అప్పుడు యీ గ్రామములో వుండబడ్డ శ్రీ అగస్తేశ్వర వల్లభరాయ స్వామివాల్ల౯కు అలయప్రాకార మంట్టపములు విస్తారముగా కట్టించ్చి ప్రభలొత్సవములు జరిగించ్చినారని చెప్పినారు.

గజపతి శింహ్వాసనస్థుడైయ్ని గణపతి మహారాజు ప్రభుత్వంచేశేటప్పుడు వీరిదగ్గర మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు బ్రాంహ్మణులకు మిరాశీలుయిచ్చే యడల యీ గ్రామమునకు వెలనాడు కాస్యప గోత్రులయ్ని సంద్దెపూడివారి సంప్రతి భారద్వాజస గోత్రు లయ్ని యాజ్ఞవల్కులు వంగ్గిపురపు వారి సంప్రతింకాస్యప గోతృలయ్ని యాజ్న పల్కులు తంమ్మరాజువారి సంప్రతి రెండ్డు పంట్లనుంవెరశి మూడు సంప్రతులవారికి మిరాశియిచ్చినారు. గన్కు తదారఖ్యా తద్వంశజులయినవారు అనుభవిస్తూవుంన్నారు. తదనంతరం స్వస్తిశ్రీ శకవరుషంబులు ౧౧౯౬ (1274 A.D.) అగునెటి భావనామ సంవ్వత్సర పుష్య శుద్ధ ౧౦ సొమవారం స్వస్తశ్రీ....గండ్డది గంత్త కాకతీయ రుద్రదేవ మహారాజులు రత్న శింహ్వా సనారూఢులయి పృధివీ సాంబ్రాజ్యము చేయుచుండగ్గాను వారి ఆనతిని కాభయపండ్డితులు వంగ్గిపురపు వల్లభునికి కోయూరపట్టణవు సుంక్కం వసంత్తహోత్సవములకు ఆచంద్రాక౯ స్తాయిగాను యిచ్చి సకలోత్సవములు జర్గించ్చిరి. శాలివాహనం ౧౨౪౦ శకం (1318 A.D) వర్కు కుమార కాకతీయ రుద్రదేవ మహారాజులుంగారి ప్రభుత్వం జరిగిన తర్వాతను రెడ్డు గజపతివారు ప్రభుత్వములు జరిగిన పింమ్మట ౧౪౩౽ (1515 AD) శకం లగాయతు కొండ్డవీటి దుగ౯ం పుచ్చుకొని కృష్ణరాయలు అచ్యుతరాయలు వారి ప్రభుత్వములు జర్గిన తర్వాతను శ్రీసదాశివ దేవమహారాయులవారి ప్రభుత్వములొ యీస్థలమందు జరిగిన దర్మములు

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక పరుషంబ్బులు ౧౪౭౮ (1556 AD) అగునెటి పింగ్గళి నామసంవ్వత్సర భాద్రపద శుద్ధ ౧౧ గురువారము నను శ్రీమంన్మహా మండ్డలేశ్వర అప్రతిక మల్ల కురిచేటి ముమ్ముడిరాజయ్యగారి పౌత్రులయ్ని రాఘవ రాజయ్య గారి పుత్రులైన మూత్తి ౯ రాజయ్య దేవచోళ మహారాజులుంగారు శ్రీమద్రాజాథిరాజ రాజ పరమెశ్వర శ్రీ వీరప్రతాప సదాశివదేవ మహారాజులుంగారు విద్యానగరమందు రత్నశింహ్వాసనా రూఢులయి పృధివి సాంబ్రాంజ్యము శెయుచుంన్డంగ్గాను శ్రీమంన్మహా మండ్డలేశ్వర రామ రాజయ్య యర్రం దిరుమలరాజయ్య దేవమహారాజులుంగ్గారు మానాయంక్క రాన్కు పాలించ్చి వుద్దరించ్చి కొండ్డవీటి శిమలోను వంగ్గింపురానను శ్రీవల్లభ రాయస్వామికి పూర్వీకమయిన్న ఖండ్రికె మావికు ౧౨శ్రీ అగస్తేస్వరస్వామివారికి ఖండ్రికెమాని కు౧౨ యీ ప్రకారంగ్గా నిన౯యించ్చినవారము ఆలయ ప్రాకారమంట్టపములు మరామతు చెయించ్చి సకలోత్సవములు జరిగిస్తూ మరింన్ని పయిన వ్రాశ్ని మూర్తి౯ రాజయ్య దెవచోళ మహారాజులుంగారు సదరహీ శకమంద్దు భారద్వాజ గొత్ర కాత్యాయని సూత్ర యజుశ్శాఖాద్యాయనులుంన్నూ... రాధ్యుల పౌత్రులయ్ని మల్లనారాధ్యుల పుత్రులయ్ని వీరయదెవరకు ఖ ౧ క్షేత్రముంన్ను కాశ్యప