పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71

వంగ్గిపురం

కయిఫియ్యతు మౌజే వంగ్గిపురం సంతు గుంటూరు సర్కారు

మృత్యుజాంన్న గరు తాలూకే రేపల్లె రాచూరు

యీగ్రామాన్కు పూర్వంనుచ్చి వంగ్గిపురమనె వాడికె వుంన్నది.

కలియుగం ౧*౮౬ సంవత్సరానను రుద్రవర ప్రసాదోద్భపుడైన ముక్కంటి మహరాజు భార్యా సమేతంగ్గాను వాయువేగములవల్ల కాశీలో ఆర్యావత్త౯ ఘట్టమంద్దు స్నానంచెశి వచ్చె యడల యోగపాదుకలు అదృశ్యమాయెను గన్కు తత్తి రవాసులయ్ని బ్రాంహ్మణులకు ప్రాధ౯న చెశి యోగపాదుకలు వడశి నిజదిశాన్కు వచ్చె సమయముంద్దు ఆ బ్రాహ్మణులముంద్దు. ష్యతు తెలిశ్ని వారయి ముంద్దు వ్యాసశాపంవల్ల యీదేశాన్కు ద్వాదశ వష౯క్షామం సంభవించ్చనుంన్నది. అప్పుడు మీదేశమున్కు వస్తూ వుంన్నాము. మమ్మున వాషించ్చ్చవలశ్నిది అని వరంపుచ్చుకొన్న వారయి ముక్కంట్టి మహారాజులుంగ్గారు నిజదేశాన్కు వచ్చి ధరణికోట ప్రవేశించి రాజ్యముచెస్తూవుంన్న నాల్గు సంవత్స రములకు గంగ్గాతీర భూములకు క్షామం సంభవించ్చె గన్కు ఆబ్రాంహ్మణులు కుటుంబ్బ సమెతంగా యీదెశాన్కు వచ్చిరి గన్కు ముక్కంట్టి మహారాజులుంగారు విరిని చాలాపూజించ్చి యీ బ్రాంహ్మణ్యులకు యెంన్నూరు అగ్రహారములు యిచ్చినవారై సప్తరుషి సంఖ్య గ్రామాదులు అనియెడు అగ్రహరములు సప్తరుషితుల్యులలైన బ్రాహ్మణులకు ధారా గ్రహితం చేశినారు. అవి యయ్యవి అంట్టేను వసిష్టస్థానంగ్గాను వుప్పుటూరు ఆత్రేయస్థానం గ్గాను గుంట్టూరు, భారద్వాజస్థానం గ్గాను సోలస, విశ్వామిత్ర స్తానంగ్గాను కారుబోల, కాస్యప స్థానంగ్గాసు వంగీపురం, యీ ప్రకారంగ్గా "ద్విసహస్ర కృతాప్రాప్తేసు తీథే౯ పూర్వసాగరే తత్రబ్రహ్మ ప్రతిష్టాంత్తు కృతవాత్రి నేత్రొ పల్లవ " యీ ప్రకారంగా కలియుగము ప్రవేశించ్చిన ౨౦౦౦ రెండ్డువేల సంవత్సరములుమీద పూర్వసముద్రాతీరమునను ముక్కంటి మహారాజులుంగ్గారు బ్రాంహ్మ ప్రతిష్టలుచేశి యీ వంగీపురం కస్యవస్థానంగ్గాను అగ్రహారం యిచ్చినారు. తదనంత్తరం కటకదేశెశ్వరుడైన నారశింహ్వదేవుడ నెరాజు సెనాపతి అయిన అనం త్తదండ్డపాలుడు దక్షిణడెశములు జయించ్చె నిమిత్తమై వచ్చి కృష్ణాతీరమంద్దు సెనా సమెతంగ్గా నివశించ్చి వుండ్డగా పూర్వం అహిభత్ర నివాసుడయిన భగవంత్తుడు బ్రహ్మ గుండ్డికా తీరమంద్దు యజ్ఞశమ౯ అనే బ్రాంహ్మణునియొక్క కాకరపాడుకింద్ద భూవివరంలో ప్రవేశించ్చి వుండ్డి అనంత్త దండ్డపాలుని స్వప్నమంద్దు ప్రసన్నుంలయి అతను వుంన్నస్థల నిధే౯శంచెశి శ్రీకాకుళ క్షేత్రమంద్దు ప్రత్తిష్ట చెయ్యమంన్నారు గన్కు అలాగ్ను ప్రతిష్టచెయ్య వలయునని ఆ భూవివరం శోధనచయ్యగా శ్రీకాకుళస్వామి వారుంన్ను యీ వల్లభరాయ విగ్రహముంన్ను కూడా దృష్టమయ్నిది గన్కు అప్పుడు స్వామివారి ఆనతి ప్రకారాన శ్రీకాకుళ స్వామివారిని శ్రీకాకుళమంద్దు ప్రతిష్ఠ చేశి తదనంత్తరమందు యీ పంగ్గిపురములో శ్రీ వల్లభదేముని ప్రతిష్ఠ చెశినారని చెప్పినారు.