పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

గ్రామ కైఫీయత్తులు


మును గట్టించి-భోగములకు స్థిరాస్తి నప్పగించి- అయ్యప్పయను సేనాపతికి పుణ్యము గలుగవలెనని - వెన్నెల - శంరన్మేఘము - మంచుకొండవంటి స్వచ్ఛమైన కీర్తి గల చిన బొమ్మ రాజు (ఇంటి పేరు మల్లనాధుని) సత్కీర్తితో మెలగెను ——

యీ ప్రకారంగ్గా చెశ్చి వారయి యెతద్ధర్మంబులు శాసనస్తంభంబుల మీద లిఖింప జేసినారు:)

పయ్ని వ్రాశ్నీ శ్రీకృష్ణరాయులు అచ్యుతరాయులు వారి ప్రభుత్వములు జరిగిన తర్వాతను స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబ్బులు ౧౪౬౫ (1543 AD) అగునేటి సాధారణ నామ సంవ్వత్సర ఆషాడ శు ౧౫ (15) సోమవారానను శ్రీమంన్మహా ముద్దలెశ్వర శ్రీమన్మహా రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీర ప్రతాప సదాశివ దేవమహారాయులు విద్యానగరమంద్దు రత్న శింహ్వాసనారూడులయ్ని పృధివీ రాజ్యము శెయుచుండ్డగాను శ్రీమన్మహామండలేశ్వర మూతి౯ రాజులుంగారి పుత్రులయ్ని రామరాజయ్య దేవ మహారాజులు గారికి పాలించనవు ధరించ్ని కొండ్డవీటి రాజ్యములోను యనమదల కరణాలు కాపులు మంగ్గళగిరి స్వామివారి సాక్షిగాను ఆంజనేయులకు పుట్టెడు క్షేత్రము సమపి౯ంచిరి. తదనంత్తరం పయిన వ్రాశ్ని సదాశివరాయులు రామరాయులు శ్రీరంగ్గరాయులు వారి ప్రభుత్వం శా ౧౫౦౦ (1578 AD) శకం వర్కు జర్గిన తర్వాతను మొగలాయి ప్రాభల్యమాయను గనుక మలికి విభురాంపాడు శహావారి తరపున ఆమీలు ముల్కి యీ దేశాన్కు ప్రభుత్వాన్కు వచ్చి కొండ్డవీడు నగయీరాలలో వుండ్డె దేవస్థానములు పాడుచెయించ్చి మసీదులు చెయించ్చె గన్కు యీస్థలమంద్దు వుండ్డబడ్డఘువంట్టి దేవస్థలములు అన్నీ ఆద్యంత్త రంలో పాడు అయ్నివి. శ్రీవీరభద్రస్వామి శ్రీగోపాలస్వామి శ్రీ ఆంజనేయులు యీదెవలయములు బహుజాగ్రత్త స్థలములు గన్కు మేచ్చొపద్రవములు సంభవించ్చకుండ్డా కాపుదారీ చెసుకొంన్నారు. ఆ దినములలో బాహుబలేంద్రుడు అనే అతడు యీస్థలాన్కు ప్రభుత్వాన్కు వచ్చి యీగ్రామాన్కు ఆగ్నేయ భాగమంద్దు చెరువు తవ్వించ్చినాడు. యీ కొండ్డవీటి సీమ సర్కారు సంతు బంద్దేలు చెశెటప్పుడు యీ గ్రామం గుంట్టూరు సంత్తులో దాఖలుచెశి బహుదినములు సంత్తు అమీలు పరంగ్గా హయిదరాబాదు సుభాకింద్దను ఆమాని మామలియ్యత్తు జర్గించినారు స్న ౦౧౨౨ (1712 AD) ఫసలీలో యీ సర్కారు వంట్లుచెశి జామీదాల౯కు పంచిపెట్టి యడల యీ గ్రామం ముతు౯జాంన్నగరు సర్కార్లు దేశముఖి మ్న నెవారయ్ని రమణయ్య మాణిక్యరాయునిఁ గారి వంట్లులోవచ్చి రెపల్లె తాలూకాలో దాఖలు ఆయ్ని దిగన్కు రమణయ్యగారు మల్లన్నగారు సీతన్నగారు గోపన్నగారు జగ్గన్నగారు ప్రభుత్వముచెశ్ని తర్వాతను తత్పుత్రులయ్ని భావన్న మాణిక్యరాయునింగారు బహుధర్మాత్ములయి మంకు౻ మజుకూరిలో పుండుకున్న దెవబ్రాహ్మణ స్వాస్యములకు నిరాటంకంగా జరిగి ప్రభుత్వం చేస్తూ వున్నారు——

రిమాకు౯ గ్రామం గుడికట్టు కుచ్చెళ్లు ౨౦౦
కిమ్నిహాలు
౪ ౦ గ్రామకంఠాలు ౫ కి
౨ కసుపా గ్రామకంఠం