పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యనమదల

61


అర్థము : శాలివాహనశకము 1453వ సంవత్సరమునాటికి సరియగు చాంద్రమాన నందననామ సంవత్సరమందు కీర్తి ప్రతాపోన్నతుడైన 'చిన్ని బొమ్మ' అను ప్రీతినామముగల రాజు యన్మదల గ్రామములోని వీరభద్రస్వామివారికి ప్రీతిగ- అనగా నా దేవాలయమునకు ప్రాకారము ముఖమండపము నందముగా నుండునట్లును ఆ యనమదల ప్రసిద్ధి నడయు నట్లు గావించెను)

సీ॥ గుణబాణగతి చంద్రగణనంబు శాలి
వాహనశక వర్షంబుల వనియందు
బరుగు నందన భాద్రపద శుద్ధ దశమిని
సోమవారమునాడు ప్రేమతోడ
యనమదల వీరంన్న కిరువుగా బ్రాకార
మును భోగరాగంబులనువు పరిచి
గణనాధుడయ్యప్పదండనాయకునకు
పుణ్యంబు కానని బుధులు పొగడ

తే॥ తారకమందార శారదాభ్ర
తు హీన హిమకర విఖ్యాతి సహరహంబు
గెలుచు సత్కీర్తి ధనముగా మెలగనేర్చు
మల్లనరనాధు చినబొమ్మ మనుజవిభుడు

(ఈ పై శ్లోక భావమే యీ సీసపద్యమున నిమిడ్చెను. ఇందలి విశేషము—— నందన నామ సంవత్సరపు మాస పక్ష-తిధి-వారములు ఇందు చెప్పబడినవి.)

సీ౹౹ గుణబాణగతి చంద్ర గణనంబు శాలివా
హన శకవర్షంబుల వనియందుఁ
బరగు నందన భాద్రపద శుద్ధదశమిని
సోమవారమునాడు ప్రేమతోడ
యెన్మదల్ వీరన్న కిరవుగాఁ బ్రాకార
మును భోగరాగంబులనుపు పణచి
గణనాధుఁడయ్యప్ప గఁడనాయకునకుఁ
బుణ్యంబు కాయుని బుధులు పొగడ

తే॥ తార తారకమందార శారదాభ్ర
తుహిన హిమకర విఖ్యాతి నహరహంబు
గెలుచు సత్కీర్తి ధనముగా మెలగ నేర్చు
మల్లనరనాధు చినబొమ్మ మనుజ విభుడు.

తా॥ శాలివాహనశకము 1453నకు సరియగు నందన నామ సంవత్సర భాద్రపద శుద్ధ దశమి సోమవారమునాడు యనమదల గ్రామములో నున్న వీరభద్ర దేవునకు ప్రీతిగా - ప్రాకార