పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

గ్రామ కై ఫీయత్తులు


మైన కీలులేసి (?) అంద్దె తనభర్త చాతచేయించ్చుకొని యీస్థశాన్కు వచ్చి శ్రీ వీరభద్రస్వామి వారి పాదం దగ్గర వుంచ్చి యిరువయి యెడు దినములు తనయొక్క భక్తి తాత్పర్యము తోటి ప్రాధ౯నచెస్తు శై వాగవములు విస్తరించ్చి జరిగిస్తూ నిరాహారియైవుంట్టూ వుండెగన్కు శిల్పికాంతయొక్క భక్తి తాత్పర్యములకు ఆనందించి శ్రీ వీరభద్రస్వామివారు సాక్షాత్కరించ్చి నవరత్న స్థాపితమయ్ని ఆంద్దె తన యొక్క పాదమున తొడగినారు. యీ యొక్క అంద్దె స్వామివారి పాదముంద్దు ప్రకాశిస్తూ వుండ్డగా దక్షిణ దేశమునుంచ్చీ వక శివభక్తుడు వీరభద్ర స్వామివారి యొక్క మహాత్యంవిని యనమదల గ్రామములోనికి వచ్చి స్వామివారి యొక్క ఆలయం ద్వారం యదుట నిలుచుండ్డి ఆడది తొడిగించ్ని అంద్దె స్వామివారి కాలియందుండ నిచ్చెనా అని ప్రతిజ్ఞలు పలికి తనయొక్క భక్తి రసంచెతను స్వామివారిని ప్రార్థనచెసి అందె విడువమన్నాడు గనుక భంగున పాదము దప్పళించి ఆ జంగం యొక్క కక్షపాలలో పడెటట్టుగా చేసినారు. యిటువంటి ప్రభావములు బహుశా జరిగినవి అని చెప్పినారు —

శా ౧౩౪౦ (1418 AD) శకం వర్కు రెడ్ల ప్రభుత్వం జర్గినతర్వాత గజపతివారు ప్రభుత్వాన్కు వచ్చి శా ౧౪౩౬ (1514 AD) శకంవర్కు ప్రభుత్వంచేస్తూ వుండ్డగా నరపతి సింహాసనస్థుడయ్ని శ్రీమద్రాజాధిరాజపరమేశ్వరులయి కృష్ణదేవమహారాయులు పూర్వద్విగ్విజయాత్రకు విచ్చేసి గిరిదుగ౯ స్తలదుగ౯ములు సాధించ్చి శా ౧౪౩౭ (1515 AD) శకమంద్దు ప్రతాపరుద్ర గజపతి కొమారుడయ్ని వీరభద్ర గజపతిని పట్టుకొని కొండ్డవీటి దుగ౯ంపుచ్చుకొని సింహ్వాచలపర్యంతం దేశములు సాధించ్చి జయస్థంభములు సంస్థా పించ్చి నిజరాజధానికి వెళ్లి వృథివీసామ్రాజ్యము చెయుచుండ్డగాను స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు ౧౪౫౩ (1531 AD) అగునెటి నంద్దన సంవత్సర భాద్రపద శు ౧౦ సోమవారంనాడు రాయను అయ్యవారు కొండ్డవీటి శింహ్వాసనము పాలెంచెగాన ఆయన సెవకుడు చినబొమ్మనాయుడు శ్రీ వీరేశ్వరునికి ప్రాకారముఖమంట్టపములు సమపి౯ంచెను—

శ్లో: శాకాబ్దేత్రి శరాబ్ది సోమన హితశ్రీ నందనా ఖ్యే
సమేగ్రామే యన్మడతీ ప్రశిద్ధ మకరోత్ కీతి౯
ప్రతాపోదయా శ్రీ మంన్మల్లయ చిన్ని బొమ్మ
నృపతి శ్రీ వీరభద్రేశితుః ప్రాకారముఖమంటపం (చ)
పరివృతః ప్రాకారమాతారకం ౹ (యిందుకు పద్యాలు) —

శ్లో: శాకాబ్దేత్రి శరాబ్ది సోమన హితశ్రీ
నందనాబ్యే సమే గ్రామ యన్మదలే
ప్రసిద్ధ మకరోత్ కీర్తి ప్రతాపోద
యాత్। శ్రీమన్మల్లయ చిన్ని బొమ్మ
నృపతిః శ్రీ వీరభద్రేతితుః ప్రాకా
రం ముఖమంటపంచ్చ పరితశ్చాకార
మాతారకం :-

-