పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యనమదల

59


౧ వెలిచేను ఖ౹౧ న ౧౦ తూములు శా ౧౨౪౦ (1318 AD) శకం వర్కు కుమార కాకతీయ రుద్ర దెవ మహారాయులువారి ప్రభుత్వం జరిగిన తర్వాతను రెడ్లు పరుసవేదివల్ల బలవంత్తులయి గిరిదుగ౯స్తల దుగ౯ములు నిర్మాణం చేసుకొని ఆరుగురు రెడ్లు నూరు సంవత్సరములు ప్రభుత్వముచెశిరి గన్కు అంద్దులో మొదటి వాడయ్ని ప్రొలయ వేమారెడ్డి ప్రభుత్వంచెశెటప్పుడు ములుగు వీరంన్న అయ్యవార్లు గారనే ఆరాధ్యులు వీరశైవాచారవ్రతసంపన్ను లయి వున్నంద్ను వీరు దక్షిణదేశం సంచారం వెళ్ళివుండి వొకానొక స్థలమంద్దు ప్రవీణులైన శిల్పులు వుండి వుండగా బహుసుంద్దరమయ్ని వీరభద్రవిగ్రహం నవమాస? పూరితంగ్గా మలిపించ్చి తమనివాస స్థళమయ్ని గ్రామంలో ప్రతిష్టచెశెటి కొరకు వఖబండిమీద(?) వుంచ్చుకొని తొలించ్చుకొని యీ యనమదల గ్రామానికు వచ్చినంత్తల్లో యిక్కడ నుంచి బండ్డిన కట్టిన యనప్పోతుముందు సాగివెళ్ళక బండ్డి అటకాయించెగన్కు అనెకె ప్రయత్నములు చెయ్యగా బండిసాగక పాయను గన్కు వీరంన్న అయ్యవార్లు గారు ఆదినం యీస్థళ మందు నిలిచి లింగార్చన జరుపుకొని ఆరాత్రి నిద్రించ్చగా శ్రీ వీరభద్రస్వామి వారు అయ్యవాల౯ గారి స్వప్న లబ్దముగా వచ్చి మాకు యీ స్థళమంద్దు నివశించ్చవలెనని అభిలాషవున్నది గస్కు బండి కదలకుండ్డ అట్కయించ్చినారు. నీవు యితరచింత్తమాని యీస్థళమంద్దె ఆలయం కట్టించ్చి నన్ను ప్రతిష్ట చెయ్యమని శల్వు యిచ్చినంత్తలో అయ్యవాలు౯ గారు చెప్పినది యెమంట్టే నెనురిక్త దశచాత వుండి బహుదేశం సంచారం చేస్తూ వున్నాను. అన్యస్థలమందు ద్రవ్యానుకూలం చెశి యెప్రకారంగా నెను ఆలయనిమా౯ణం చెయించనెర్తును అని దీనత్వంగా పలికే వర్కు మాయొక్క ప్రభావంపల్ల నుంచిన్నీ యీ స్థళమందు భూగతమైయున్న ద్రవ్యం నీకు దృష్టాం త్తంకాగలదని ఆనతిచ్చినారు. మరునాడరుణోదయాన తత్పూర్వమందె అయ్యవాలు౯ గారు స్నాన సంధ్యాధ్యనుష్టాన మతానుసరణ శివపూజ విధులు యధోక్త ప్రకారంగ్గా జరుపుకొని వీరభగ్రస్వామి విగ్రహమున్న ప్రదేశాన్కు వచ్చె వర్కు బండ్డికట్టిన రెండు యనుప్పోతులు రెండూన్నూ ఆ ప్రదేశమంద్దున్న మడుగులోపడి కారాడుతూవున్న సమయంలో భగవదాజ్ఞవల్ల రెండు గొలుసుల(చెరవము) వెర్వములు యనప్పోతుల కొమ్ములకు తగులుకొని వచ్చే గన్కు వీరంన్న అయ్యవాల౯ గారు గ్రామస్తులు పిలవసంపించ్చి యీ చరపములు (చెరవములు) రెండ్డుంన్నూ తీయించ్చి భద్రము చేసి ప్రోలయ వేమారెడ్డిగార్కి యెరుకచేసేవర్కు కొండ్డవీటి నుంచ్చి తక్షణమంద్దే యీస్థశాన్కు వచ్చినవారయి యీ స్వామివారియొక్క ప్రభావం విని బహు సంతోషించ్చితాను శైవాచార సంపన్నుడుగన్కు దృష్టమైన ధనం వ్యయం చెయించ్చి బండ్డి యెస్థలమందు నిలిచినదో ఆ స్థలమందు దెవాలయం కట్టించి భద్రకాళి సమేతంగా శ్రీ వీరభద్రస్వామివారిని వీరంన్న అయ్వవాల౯గారి చాతను ప్రతిష్ఠచెయించ్చి యీ స్వామివారిని పూజించ్చ డాన్కు వెలనాటి బ్రాంహ్మణులను నియమించ్చి ములుగు వీరంన్న అయ్యవాల౯గారికి యీ స్తళానకు స్థానాచార్యత్వంగ్గా నిన౯యించ్చి మరింన్ని యీ గ్రామమంద్దు పూర్వం కోటగణపమ దేవి ప్రతిష్ఠచెశ్ని శ్రీబెతెశ్వర గణపేశ్వరస్వామివాల౯కు సకలోత్సవములు జరిగించ్చెటట్టు పూర్వమర్యాడలు జరిగించ్చినవారై మరింన్నీ యీస్థళమందు క్రమేణ నూటయెన్మి దిశివాలయములు నిర్మాణంచెయించ్చి నూటయెన్మిది శక్తిస్థళములు కూడా ప్రతిష్ఠ చెయించ్చి సకలోత్స వములు జరిగిస్తూ ప్రభుత్వముచేస్తూ వుండ్డగా శ్రీ వీరభద్రస్వామివారు అనేకములయ్ని ప్రభావములు మహిమలు ఆగపరుస్తూ వుందురుగన్కు వకభక్తురాలైన శిల్పిస్త్రీ నవరరత్న స్థాపిత