పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

గ్రామ కైఫీయత్తులు


ఆ చంద్రాక్క౯ముగాను పూరు. అందులసానివార్కి బెట్టిన వృత్తులు వాచెకకు మాచకు ఖ ౨ మోకరి మాచ్చకకు ఖ ౧ న ౧౦ పాత్రశెతకు ఖ ౨ న ౧౦ పాత్రసూరుకు ఖ౨ న ౧౦ తగరం మశీకు ఖ ౧ న × బండ్డ సూరకు ఖ ౧ న ౫ ఖండ్డ లక్కిమకు ఖ ౧ న ౫ వాండ్ల మాచమకు ఖ ౧ న ౫ బొల్లమకు ఖ ౧ న ౫ జట్టలదెనకు ఖ ౧ న ౫ మల్లకవితకు ఖ ౧ లంజెనాగకు ఖ ౧ రెకమకు ఖ ౧ న ౫ న హవాళి నోమనకు ఖ ౧ న ౫ మద్దెలదామకు ఖ ౨ పేరుమాదిరె నాగకు ఖ గాన ౫ వెరశి ఖ ౨౩ న ౧౦ తూములు శాసనశ్లోకాలు చెప్పిన నరశింహ్వభొట్లు వుపాధ్యాయులకు బెట్టిన మరుతు ౧ వెలిపొలము ఖ యీ ప్రకారంగా బెతెశ్వరస్వామివారి అచక పరిచారిక మొదలయ్ని వినియోగములు చేశి వారికి వృత్తులు నిన్న౯యించ్చి మరింన్ని యీ స్తలమందే తమతండ్రి గణపద్దెవ మహారాజునకు నభివృద్ధి గాను గణపెశ్వర దేవర ప్రతిష్ఠచెశి ఆ దేవర అంగ్గరంగ్గ భోగానకు చంద్రాక్క౯ముగా నిచ్చిన వూరు చింతపల్లి ఆ వూరును గణపెశ్వర స్వామివారి గుడి సానివారికి బెట్టిన వృత్తులు మద్దెల కెతుకు ఖ ౨ న ౧౦ కవులు వీరమకు ఖ౦ న ౧౫ మోకరి మాదెక్కకు ఖ ౧ న ౧౫ గంగ్గమకు ఖ ౧౫ న రుద్రమ్మకు ఖ ౧ న ౧౫ యల్లవ్వకు ఖ ౧ న ౧౫ పాత్రిదెవప్పకు ఖ ౧ న ౧౫ పాండ్రనాచమకు ఖ ౧ న ౧౫ పాత్ర ఆదెమ్మకు ఖ ౧ పాకలమ్మకు ఖ ౧ భాగవతులవాల౯కు ఖ ౧ దుగ్గ౯ంగారి మల్లప్పకు ఖ ౧ పెద్ద మాచకు ఖ ౧ సహవాశి కోటయ భత్తునికి ఖ ౧ న ౧౦ తూములు యీ ప్రకారంగ్గా గణపెశ్వర స్వామివారి అచ్చ౯క పరిచారిక వెశ్యాధి జనంబ్బులకు వృత్తులు సమప్పి౯ంచ్చి తదనంత్తరం యీ స్థలమందు విష్ణు స్థలం కట్టించ్చి శ్రీ వేణుగోపాలస్వామివారిని ప్రతిష్ఠచెశి యీ స్వామివారి అంగ్గరంగ్గ భోగాధ౯మై ఆచ్చ౯క పరిచారికాది పరిజనంబ్బులకు కొంత్త మాగాని పొలముంన్ను ఖ ౮ యెన్మిది పుట్లభూమి యవనాళములు పండ్డె పొలముంన్ను సమప్పి౯ంచినది.

యీ ప్రకారంగ్గా పయిన వ్రాశ్ని స్వామి వాల్ల౯కు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవములు జరుగగలందుల్కు వెళ్ని ధర్మంబ్బులు శాసన స్తంభంబ్బులమీద లిఖింప్పజెశి కొన్ని దినములు ప్రభుత్వం చెశెను తదనంతరం శ్రీమన్మహామండలేశ్వర కోటదెవరాజు ప్రభుత్వం చేస్తూ బెతెశ్వరమహదెవరకు ఆచంద్రాక౯ అఖండ వత్తి౯ దీపములకు గంగ్గుల ప్రోలెబోయుడు మారిఫత్తున ౨౫ గోవులను వుంచ్చి నిత్యం మానెడు నెయ్యి యిచ్చే లాగ్ను నిన౯యించ్చినాడు. శాలివాహనం ౧౧౮౨ (1260 AD) శకం వర్కు నారపరాజు అతని తంమ్ములు, శెమ్మిరాయుడు మొదలయ్ని వారు బెతెశ్వర స్వామివారికి అఖండ వతి౯ దీపానకు గొర్రెకదువు పఖటి యనవెడ్లు ౨౧ మారెబోయెడు వడ్లబోయెడు మారిఫత్తున వుంచ్చి నిత్యంమూడు తవ్వలనెయ్యి చొప్పున పుత్రాను పౌత్రీకము యిచ్చెటట్టుగా నిన౯యించ్చి యెత ధర్మంబ్బులు శాసనస్తంభంబ్బులమీద లిఖింప చేసినారు.

సదరహి పయ్ని వ్రాశ్ని దెవస్థళాలకు తత్పూర్వం స్వస్తి శ్రీ శుభశకవరుషంబ్బులు ౧౧౬౩ (1241 AD) అగునేటి శార్వారి సంవత్సరాన స్వస్తి సమస్త ప్రశస్తంబైన శ్రీమతు ముత్త సానింగారి కాటమరెడ్డింన్ని వారి చెల్లెలు రెన్నసాని కొడుకు యర్రం గొమ్మ నాయుడుంన్ను వారి మరిది సూరపనాయుడుంన్ను శ్రీమన్మహామండ్డలేశ్వర కోటబేత రాజులకు ధర్మార్థముగాను రుద్రేశ్వర శ్రీమహదేవరను ప్రతిష్టచెత నైవేద్యానకు బెట్టినది నీరు నెలమరుతు ౧ వెలిచేను ఖ౹౩ రాఏవాగునతోట పదితూములు గణపమదేవులు యిచ్చినది నీరు నెలమరుతూ