పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

యనమదల

కయిఫియ్యతు మౌజే యనమదల సంత్తు గుంటూరు తాలూకె

రెపల్లె యీలాకే రాజా మాణిక్యారావు భాపనారాయణరావు

సరుదేశముఖి మన్నెవారు సర్కారు ముతు జాంన్నగరు

పూర్వం శాలివాహన శక వరుషంబ్బులు ౧౦౫౯ (1134 AD) శకం మొదలు కొని గజపతి శింహ్వసనస్తుడయ్ని గజపతి మహారాజు తక్తు బిఠాయించ్చి రాజ్యం చెశెటప్పుడు వీరిదగ్గర మహా ప్రధానులయ్ని గొపరాజు రామంన్న గారు ౧౦౬౭ (1145 AD) శకమంద్దు బ్రాహ్మణులకు గ్రామకరిణికపు మిరాశీలు యిచ్చినప్పుడు యీగ్రామాన్కు గొల్లపూడివారు సంప్రతి ౧ పచ్చి మిరియంవారు సంప్రతి ౧ సల్కవారి సంప్రతి ౧

తదనంత్తర అనుముకొండ్డ శింహ్వాసనారూఢులయ్ని కాకతీయ్య వంశజులైన ప్రోలరాజు ప్రతాపవంత్తుడై ఆంధ్రదేశం ప్రభుత్వంచేశిన మీదట యితని కొడుకు మాధవ భూపతి రాజ్యంచెశ్ని తరువాతను యితని కొమారుడయ్ని గణపతి రాజ్యంచెస్తూ వుండ్డి ధాన్యవాటి పురాధీశుడై నషువంట్టి కోటకెతరాజుకు పుత్రుడయ్ని రుద్రరాజు కొమారుడయ్ని బేతరాజుకు తన కొమా త్తె౯ అయ్ని గణపాంబ్బికను యిచ్చి వివాహం చెళెగన్కు ఆ బేతరాజు కొన్ని దినములు ప్రభుత్వం చెశీ స్వగ్గ౯ లోకప్రాప్తుడు అయ్నిన తర్వాతను అతని భార్య అయ్ని గణపాంబ్బిక ప్రౌఢగనుక రాజ్యభారం వహించ్చి ప్రభుత్వంచెస్తూ చెశ్ని ధర్మములు. “స్వస్తి చతుస్సముద్రముద్రిత నిఖిల వసుంధరా పరిపాలిత శ్రీమత్రినయన పల్లవ ప్రసారా సాదిత కృష్ణవేణ్యానది దక్షిణ షట్సహస్త్రావనీ వల్లభ భయులోభరుల౯ చోడచాళుక్య సామంత్త మదానెక పమృంగేంద్ర విభవ (వా) మరేంద్ర శ్రీమదమరేశ్వర దేవదివ్య శ్రీపాద పద్మా రాధక పరబల సాధక శ్రీ ధాన్యకటక పురహ (వ) రాధీశ్వర ప్రతాఫలంకేశ్వర కలిగడ (యొ) గడలేమి చెడువరరివకై గండ్ల గండ్డ రగండ్ల గండ్డభేరుండ్డ జగమెచ్చు గండ్డ నగ్నిమార్తాండ్డ నామాది సమస్త ప్రశస్త సహతం శ్రీమన్మహా మండలేశ్వరకోట గణపమ దేవంమ్మగారు" పృధివి సాంబ్రాజ్యము చేయుచునుండ్డి శాలివాహన శకవరుషంబ్బులు ౧౧౭౦ (1248 AD) అగునెడి సౌమ్య సంవత్సరమునాడు అమరేశ్వర శ్రీ మహదేవర విమానము? నంద్దు పెట్టిన... పైడికోట ఆంద్దగణపపురపువాడు అనంగ్గాను కట్టించ్ని యిండ్లు పండ్రెండు వీరికి బెట్టిన వృత్తులు వరంచెను యడ్మకుడియంద్దు నుంగాను బెట్టిన వెలిప్రొలము ఖ ౨౪ పుట్లు వీరికైన మంద్దలను గొల్లకుంట్ట వెనుకబెట్టిన మరుతులు ౬ వాడ్డూరివారి చెరువు వెన్కు బెట్టిన మరుతులు ౬ తమకు ధర్మపుగాను... సాన్నబడ్డత సెప్పిన యిండ్లు బ్రాంహ్మలకు బెట్టిన వెలిపొలము తక్కెళ్లపాటి బెట్టిన చేను ఖ ౧౨ పండ్రెండు యిప్రకారం ధర్మములు జరిగించ్చి తదనంత్తరం యీ యనమదలకు వెంచ్చెశి బెతరాజునకు పుణ్యముగాను బెతెశ్వరదేవర ప్రతిష్ఠచెశి ఆ దేవరకు ఆంగ్గరంగ్గ భోగాధ౯మై