పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

గ్రామ కైఫీయతులు


శ్లో॥ ౧౭. ప్రాదాత్ మృత్యుంజయార్భాయ యావనాళకులాయచ I
కౌండిన్యముని గోత్రాయ సాష్టభోగైః పరార్థకం ॥

తా॥ మిగిలిన మూడుభాగముల పురమును అష్టభోగములతో గూడ ఆ వేమరాజు జొన్నలగడ్డ వంశీకుడును-కౌండిన్యస గోత్రీకుడైన మృత్యుంజయుడను బ్రాహ్మణునకు దానముగా నిచ్చెను.

అని యీ ప్రకారంగా స్వస్తి శ్రీ శాలివాహన శకవరుషంబ్బులు ౧౨౬౫ (1343 AD) అగు నెటి తారణనామ సంవత్సర ఫాల్గుణ శు 15లు చంద్రగ్రహణ కాలమంద్దు జ్నొలగడ్డ మృత్యుంజయార్యులుగార్కి శ్రీమతు అనపోత వెమరెడ్డింగారు తనమెనమామ యయిన నాగ సేనాపతి పెరను యీ ముట్నూర్కు రాజనాగపురం అనే అభిదానం చేశి అష్టభోగ సహితంగ్గా అగ్రహారం యిచ్చిరి గన్కు పయ్ని వాశ్ని మృత్యుంజయాలు౯ వెదశాస్త్ర శ్రొత విద్వజ్జన కోలాహలులై నిరంత్త రమున్ను బ్రాంహ్మణులకు అంన్నదానం చేస్తూ కొన్ని దినములు అనుభవించ్చి తర్వాతను యీయ్న పుత్రుడైన అనంత్త సోమయాజి తదనంత్త రం యీయ్న సుతుడు త్రియంబక దీక్షితులు ఆదనాగ్ని హూత్రం అవిచ్ఛన్నంగా జర్పుకొని శాలివాహన శక వరుషంబ్బులు ౧౪౩ఽ (1515 AD) శకమంద్దు శ్రీకృష్ణదెవరాయలు ప్రభుత్వంలో యీగ్రామాన్కి వుత్తర భాగమంద్దున చెర్వు తవ్వించ్చి యర్రచెరువు అని నామాంక్కితంచెశి యీశాన్య భాగమంద్దున బావి తవ్వించి పెద్దబావి అని నామాం క్కితముచెశి గ్రామ మధ్యమంద్దునను శివస్థళం కట్టించి రామలింగ్గస్వామి వార్ని ప్రతిష్టచేసి అర్చకత్వానుకు కౌశిక్క గోత్రుడయ్ని చెబ్రోలు రామాబొట్లు అనె పూజారిని నియామకంచెసి నైవెద్య దీపారాధన్కు కు౧ పొలం మాన్యం యిచ్చినారు. యీయ్న కోమారుడు రామకృష్ణ సోమయాజి యితని పుత్రు అయ్ని బైరవ సోమయాజులు యితని సుతుడు అంన్నభోట్లు యీయన కొమారుడు వెంక్కటభొట్లు విరి తనయులు భయిరవభొట్లు యీ పెద్దిభొట్లు భయిరవభొట్లు కొమారుడయిన లింగ్గంభొట్లు యితని కొడుకు అన్నంపూణ౯ బొట్లు యీయ్న తనయులు దక్షిణామూత్తి౯ - సోమయాజులు గారు వుదయించిరి గన్కు విరు మహ ప్రబలులై శాలివాహనం ౧౫౯౪ (1672 A. D.) అగునెటి పరిధావి నామ సంవ్వత్సర మందు గ్రామాన్కి దక్షిణ పాశ్వ౯ మంద్దున పూర్వకాలం నుంచ్చివున్న సిత గుండ్డం జలధిమట్టుకు తవ్వించ్చి గ్రామ మధ్య మయ్ని సోమవీధికి పశ్చిమ భాగ మంద్దున విష్ణుస్థలం కట్టించి గోపాలస్వామి విగ్రహాన్ని చేయించ్చి ప్రతిష్ట చేశి అచ౯ కత్వాన్కు భారద్వాజ గోత్రుడయ్ని పెద్దింటి నారాయణప్ప అనే వైఖానసుణ్ని పొంన్నూర్ నుంచ్చి తిస్కు వచ్చికు ౧ మాన్యం యిప్పించ్చి పండ్డుగ పర్వాలకు మొదలయ్ని వుత్సవాదులు జరిగిస్తూవుంన్న మీదట శాలివాహనము ౧౬౦౮ (1686 AD) క్రోధన సంవత్సరములో సుల్తానబ్బులహస౯ పాదుశహగారు తఖ్తుకు అధికారిఅయి రాజ్యం చేశెయడల వీరి దగ్గర అక్కంన్న మాదంన్న గారు ప్రధానత్వం చెస్తూ వుండ్డి పూర్వపు రాజులవలెనె అగ్రహరం జర్గించ్చిన పింమ్మట పుణ్యపల్లి గోత్రోద్భవులయ్ని కృష్ణాణి రఘుపతి మాణిక్యరాయినింగారి కొమారులయిన జంగ్గమయ్య మాణిక్యరాయునింగారు పయ్ని వ్రాశ్ని దక్షిణామూర్తిన్ సోమయాజులను కూడా తీస్కుని గోలకొండ్డ వెళ్ళి అక్కంన్న మాదంన్నగారి పరంగ్గా పాదుశహ వారి దర్శనంచేశి