పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముట్నూరు

49


శ్లో॥ ౧౨, స్తంభా౯ కీతిన్ కృతే విస్వజింత్యకుశలా భూమీశ్వరా నీశ్వరా
నిశ్చిమాన్య కృతిర్వినిర్మల మతిశ్శే వేమపృధ్వీపతి ః 1
యేన శ్రీగిరి రస్యహోబళగిరి స్సోపానమార్గాంక్కితా
విఖ్యాతాం రచితా సనాతన యశస్సంబా-తలం భూతలే ॥

తా॥ కీర్తి కొఱకా వేమరాజు భూమికి స్తంభములవలెనున్న రాజుల జయించి ఇతురులొ నర్చిన పనులనన్నిటిని సంపూర్తి చేసి ప్రకాశించు చుండెను సనాతనమైన కీర్తి నార్జించుకొనిన యీభూలోకమందు ఏరాజు ( శ్రీగిరి పర్వతము లేక శ్రీ శైలము) అహోబిల క్షేత్రములకు సోపానముల నిర్మింపజేసెనో అతడే ప్రస్తుతరాజై ప్రకాశించుచుండెను.

శ్లో॥ ౧౩. వేమక్క్షితీ శోవృషమేకపాదం ఖంజప్రకారం కలికాలదోషాతి
చత్తాగ్రహార ద్విజ వేదశక్త్యాపద క్రమైరస్థలితంచకార

తా॥ ఆవేమరాజు- కలికాలదోషముచే నేకపాదముతో కుంటుచున్న ధర్మమను వృషభమును - సత్ప్రహ్మణుల కగ్రహారాది దానములిచ్చుటచే వారు వర్ణించెడి పదక్రమ (వేదములోని సంజ్ఞలు) ములతో నడువగల దానినిగ జేసెను——

శ్లో॥ ౧౪. ధర్మాత్మజోదాశరధిః పృధుశ్చాప్యు దీర్యమాణాని
యుగాంత్తరేషు। వితర్కయే వేమన రేశ్వరస్య
పుణ్యాని నామాని పురాతనాని ॥

తా॥ యుగాంతరములలోనున్న పుణ్యపురుషులగు శ్రీరాముడు, ధర్మరాజు-పృధు చక్రవర్తి అను రాజులు వేమరాజు పరిపాలనలో సర్వదా గుర్తుకు వచ్చుచునే యుండిరి.

శ్లో॥ ౧౫. శాకాబ్దే వర?తర్క భానుగణనాయుక్తొ శుభౌ తారణే
ఫాల్గుణ్యాము పరాగపుణ్య సమయె శ్రీవేమ భూమీశ్వరః|
పుణ్యార్థం నిజమాతులస్యకృతిన శ్శ్రీనాగ సేనాపతేః
గ్రామం ప్రావిశదష్టభోగ సహితం ముట్నూరినామాంక్కితం॥

తా॥ శాలివాహన శకం-'1265వ సంవత్సరమునకు సరియగు తారణ నామ సంవత్సర పాల్గుణ మాసములో వచ్చిన గ్రహణసమయమందా వేమరాజు- నాగ సేనాపతి అను పేరుగల తన మేమగారి సద్గతికై ముట్నూరు అను పేరుగల గ్రామమును అష్టభోగ సహితముగా దానించెను.

<poem>శ్లో ౧౬. దత్తం మాతుల పుణ్యాయచైక భాగంత్తు శాశ్వతం। కృత్వాగ్రామం తస్యనామ్నా రాజా నాగపు రంవ్యధాత్ ॥</poem

తా॥ తనమేమగారి పుణ్యార్థ మొక్క భాగమును విభజించి దానికాయన పేరుతో 'నాగపురము' అను నామము నొనరించెను.