పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

గ్రామ కైఫీయతులు


తా॥ (సాధారణముగా పాములకు కన్నులే చెవులు ఇక దాని నాధారముగా గొని యీ కవి చమత్కరించుచున్నాడు. ఏమనగా ?) ఆ ప్రోలరాజుగారి కీర్తిని గానముచేయు నాగాంగనల ముఖములను రాగముచే నెఱ్ఱవారగా - ఆ గానమును వినవలయుననియు.- అదే సమయమున నా ముఖముల జూడవలయుననుకొన్న ఆదిశేషువు తనకుగల చక్షుశోత్ప్రత్వమును సహింపలేకపోయెను - అనగా పాతాళలోకము వఱకు ప్రోలరాజు కీర్తి వ్యాపించే సనియు - సహస్ర వదనునకుగూడ దానిని వినవేడుక గలిగెనని తాత్పర్యము -

శ్లో॥ (౯) సెంద్దోశ్రీరివ దొడ్డయాద్గుణనిధే జాన్ తాన్నమాంబ్బాతతః
శ్వాసితత్పురుషో త్తమస్యదయితా సాచక్రమేణాకృశి |
సాద్వి విరమసూత మాచనృపతిం శ్రీవేమ పృధ్వీపతిం
దొడ్డక్ష్మాభుజమంధకార రవినాం శ్రీ వల్ల భూపల్లభంః |

తా॥ పాలసముద్రము నుండి లక్ష్మి జనించినట్లు దొడ్డరాజు అనే పేరుగల వానికి అన్నమాంబ యుదయించెను - ఆమె పురుషోత్తముడయిన ప్రోలయకు భార్యయయ్యెను. ఆపతివ్రతయు-నుత్త మురాలగు అన్నమాంబ క్రమముగ మాచయ్య వేమయ్య దొడ్డయ్య అను వారిని సూర్యకాంతిని ధిక్కరించు రాజులను గనెను –

శ్లో॥ (౧౦) తేషాంసర్వగుణోత్తర స్పురపతే శ్రీశ్రీవేషభూమీశ్వరొ
హూమాద్రి ప్రతి మానదాననిరతో ధర్మప్రతిష్ఠాగురు :
యస్మి౯శాసతిపాక శాసననిభేసత్వా౯మహిమండలం
ప్రష్టంత్తి క్రతుభాగదాన నిరతా భూనిజ౯రా నిజ౯రా ॥

తా॥ ఆమువ్వురిలో వేమరాజు సర్వసుగుణోపేతుడు- మేరుపర్వతమునైన దానమీయ సమర్థుడు-ధర్మస్థాపకుడు- ఏవేమరాజు భూమిని సర్వమండలాలంకారముగ బాలించుచుండెనో ఆరాజు పరిపాలనా కాలమున యువకులు బ్రాహ్మణులందఱు యజ్ఞభాగములతో దేవతలను తృప్తి పఱచుచుండిరి.

శ్లొ౹౹ (౧౧) ప్రాదాద్పుణ్య తరంగణి ముభయతః కృష్ణాంచ్చ గొదావరిం
నిప్రేభ్య ః కిల వేమభూతలపతి స్సారాగ్రహారా౯ బహూనా౯ ॥
నైతచ్చిత్య్రమనస్య రాజసుకరం నిశ్చిమ దానం భువా
యెన బ్రాహ్మణ జాతి సూత్రసులభావృత్తిః కృతావణ్వ౯త ॥

రా॥ వేమరాజు కృష్ణా గోదావరియను ఉభయనదుల ప్రక్కగా ననేకా గ్రహారములను పుణ్యదినములలో దానమును జేసెను. ఇది యొక చిత్రముకాదు.ఏవేమరాజు పరిపాలనా సమయమున బ్రాహ్మణ మాత్రవృత్తి చాల సుఖకరమైనదిగా భావింపబడెనో అట్టి యారాజు భూమిని హద్దు లేనంతగా బ్రాహ్మణులకు దానమును జేసెను.