పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముట్నూరు

47


తా॥ బ్రహ్మదేవుడు వర్ణములలో (అక్షరములలో) నాల్గవవర్ణములను అనగా ఘ, ఝ, ఢ, ధ, భ- అనువానిని సర్వవర్ణములలో మహాప్రాణములనియు శ్వాసములనియు, ఘోషములనియు నిర్మించెను. (ఇది వ్యాకరణ శాస్త్ర ప్రసిద్ధము) అట్లే చతుర్థ వర్ణము శూద్రపర్ణము సర్వవర్ణముల వారికి ప్రాణభూతమైనది.

{{

౬. శ్లో॥ తస్మాదభూద్వెమయ సైన్యనాదొ వంశస్య కత్తా౯ వర విక్రమశ్రీః |
పృధు ప్రతాపస్య భుజెనసారెగౌక్కా దసూర్యెణఘ గురై ని౯బధాః |

తా॥ ఆ విష్ణుపాదమునుండి - పెద్దవాడైన ప్రతాపరుద్రుని సైన్యనాధుడును ; విక్రమశీలుడునగు వేమయ్య అను నాతడు పుట్టెను - అ ప్రతాపరుద్రు భుజబలముచేత భూదేవి సారముగలదై ఆయన యందలి సుగుణములకు సంతసించి కోరిన కోరికలను ప్రసవించుచుండెను - ఇందు గౌః = అను శబ్దమునకు భూమి- ఆవు- అను రెండర్థములు గలవు - కావున ప్రతాపదుని పరిపాలనలో భూమి కామధేనువువలె కోరిన కోర్కెలనిచ్చు చుండెనని భావము ——

{{

2.శ్లో॥ సంగ్రామపార్ధన్ శరైర్విద్విభిన్నా యస్యారిచూడామణయోవిచేలుః
ఆక్రామతస్సంయధి రాజవంశా౯ ప్రతాపవంహ్నోరివ విస్ఫులింగాః |

తాః॥యుద్ధములో నర్జునునివంటి వాడైన యీ ప్రతాపవంతుడు శత్రురాజుల వంశములను తన ప్రతాపాగ్నిచే కాల్చుచుండగా పైకెగసిన మిణుగురులవలె - శత్రురాజుల కిరీటములందలి మణులు యుద్ధమున ప్రతాపముచే నెగురగొట్టబడినపై యటునిటు పడుచుండెను.


౮. శ్లో॥ పుత్ర స్తస్య భుజాదినిజిన్ ప్రోలక్షమాథిశ్వరొ
యస్యోదగ్రతర ప్రతాపరవిణా సంత్తావతావైరిణః |
విద్ధఁతేనచనిర్వ౯తిం జలని ధిధ్వీర్దీ పెష్వనూ వేషుచ
ఛాయావృక్ష సమాకులేషు సరితాలకూలేషు శైలేషుచ ॥

తా॥ ఆ వేమరాజ పరితాపముచే వైరిరాజులందరును సంతప్తులై సర్వులు ఆయనకు వశులైరి - ఆతని పుత్రుడు ప్రోలయరాజు - ఆ ప్రొలయ తన పరాక్రమముచే శత్రువులను పారద్రొలగా నా శత్రువులందరును - సముద్ర ద్వీపములందు, అడవిలోని నీటి పడియ లందును, వృక్షచ్ఛాయలందు, నదుల తీరములందు, పర్వతములందును తలలదాచుకొని యుండిరి.

౯. శ్లో॥ యత్కీతీ౯గానసమయే ఫణిసుంద్దరీణా (గా)
మాలొకితుంచ్చముఖ రాగమసంగ్గమూలం॥
శ్రోతుంచ గీతరచనం యుగపన్నదక్షా
నాగాధిఫొన సహతే నయన శృతిత్వం॥