పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

గ్రామ కైఫీయత్తులు


శాసనంలు: పాయాద్వరాహవపుషః ప్పరమన్యపుంహైదంష్ట్రా జగంత్తి శిఖరెధరణిందధానా ।
శృంగాగ్ర భాగపరిచుంబ్బిత మెఘబింబ్బాసుం లక్ష్యమాణ సుపమేవ శశాంక్కరేఖా॥

తా॥ వరాహావతారుడైన పరమపురుషునియొక్క - ధరణీధరమైన దంష్ట్రకొమ్ముల యందు మేఘములుండిన చంద్రలేఖాకాంతివలె శోభించుచుండెను.

౨.శ్లో॥ లిలాద్యూత జితాంకుశధరకళాం మౌశౌద్వడంకిలితా
మాహిత్తున్ం యుగముంన్నమయ్య భుజయోరిదిన్ శ్లేషయంత్యా మిధః |
పార్వత్యాః కుచకుంభపారశ్వన్ యుగళేసత్ప్రేమలొ లెక్షణః
కాలక్షేపణ మింద్దుమోచన విదౌకాంక్షం శివః పాతువః ॥

తా॥ పార్వతీ పరమేశ్వరులు విలాసముగ నాడుకొనెడి యాటలో గెలుచుకొనబడినదియు, అంకుశకళను ధరించినదియునగు చంద్రకశను శిరసుపై దాచి పెట్టుకొనియెనని శివుడా పార్వతీదేవి గుంజుకొన బ్రయత్నించెడి రెండుచేతులు కౌగిలిని వదలించుకొనుచు తనకు స్పర్శసుఖము నొసగెడి యామె కుచకుంభములపై ప్రేమదృక్కుల బఱపుచు, ఆయం కుశకళవలెనున్న చంద్రకళను పార్వతికి జిక్కినదానిని విడిపించుకొన జూచెడివాడై మిమ్ము రక్షించుగాక :-

౩.శ్లో॥ తమె హరెతాంత్తవ పుష్పవంత్తా ।
రాకాసు పూర్వపరశైలభాజౌ |
రథాంగ్గలీలా మివదశన్ యంత్రా |
పురాపురారెః పృధివీరథస్య ॥


తా౹౹ పూర్వము త్రిపురాసుర సంహారకాలమున భూమిని రథముగ జేసికొనిన శివుని యొక్క యారథచక్రములకు వలెనున్న సూర్యచంద్రు లిర్వురును పున్నమ దినములలో - ప్రాక్పశ్చిమాద్రుల వెలుగొందెడివారై నీకు పుష్పములుగా శోభించుచు ఐహికాముష్మిక దుఃఖములను హరింతురుగాక!

౪.శ్లో॥ యన్మౌళౌనిహితం, చిరాయనిగమైద్వి౯ యంద్య యుద్యోగిభిశి
వ్యల్లక్ష్మికర పల్లవాదరగతం సంవ్వాహనై తా౯లితమ్ |
జాతాయత్రవియన్నది త్రిజగతి సంత్తాప నిర్వాపిణీ |
తస్మాదా విరభూత్ప దాన్మధురిపో వర్ణశ్చతుర్థీ ఽవరః

తా॥ ఏయది బలిచక్రవర్తి శిరమందుండెనో, ఏది మహాయోగులచే వేదవాక్యములతో గొని యాడబడియెనో, ఏదానిని లక్ష్మీదేవి సంవాహనాదులచే (కాళ్లొత్తుట) నిత్యము సేవించుచుండెనో, దేనినుండి ముల్లోకసంతాపమును, పాపమును హరించెడి గంగానది యుద్భ వించెనో యా విష్ణుమూర్తి పాదమునుండి నాల్గపదియైన శూద్రజాతి జన్మించెను.

౫.శ్లో॥ వినిమి౯తొ విశ్వస్వజాప్రయత్నాత్ప ర్వేషు వణె౯ష్వపి సారభూతః ।
లొకె మహప్రణతయాధ్రసిదః సస్యశ్వాన ఘోషశ్చ చతుర్ వన్న౯ః౹౹