పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముట్నూరు

51


ఫరమానా వ్రాయించ్కుని తిర్గి దేశంలోకి వచ్చి కృష్ణాగర్భమంద్దున మీకు రెడ్డిదత్తి అగ్రహరమైన ముట్నూరు వలన మాకు రాగల రుసుము సావరాలున్ను పట్టి పర్పు పంచ్చిపోతలు? రాగల రొఖ్కమున్ను మా సంస్థానములో పుత్రపౌత్ర పారంపర్యంగా మీకు శ్రీరామాప౯నంగ్గా యిస్తిమి గన్కు మీ పుత్రపౌత్ర పారంపర్యంగా అనుభవిస్తూ మమ్మును ఆశీర్వచ్నము చెస్తూ పుఁడ్డుము అని దాన పత్రికలు వ్రాయించ్చి యిప్పించినారు.శా ౧౬౧౧ (1689 AD) అగు నెటి విభవనామ సంవ్వత్సరములో ఆవరంగ్గళహపాదుశహ గారు తాలూకాలు దేశస్థుల తెరగడలు చేశి యిప్పించిరిగన్కు అక్కడనుంచి శ్రోత్రియమనీ కొద్ది గొప్ప శిస్తు యెప౯రచి పుచ్చుకొనిరి. అక్కడనుంచ్చి శకం ౧౬౪౧(1719 AD) ఆగునేటి విళంబ్బినామ సంవ్వ త్సరములో భొజ్జబహదరు గారు సుభా నుంచి వచ్చి వికారి సంవ్వ త్సరములో మాఘ శుద్ధ ౩ ఆదివారం ముట్నూరు ప్రవేశించ్చి హవేలీ కట్టించడాన్కు కన్యాలగ్న మంద్దు స్తంభప్రతిష్ట చేయించ్చి హవెలీ కట్టించ్చి తయారు అయ్ని తర్వాతను వక బావి తవ్వించ్చి హవెలీలో ప్రవేశించ్చి యీ మూత్తి౯ సోమయాజులు గారి యంద్దున చాలా ప్రీతి చేస్తూ తాలూకాలో ఆజ౯మశాతు మొదలయ్ని వాట్కి పంపించి దరియాప్తు పుచ్చుకుంటూ గ్రామం నూరువరహాల్కు శ్రోత్రియఁగ్గా యిప్పించ్చెను. అక్కడ నుంచ్చి తాలూకా జమీదాలు౯ మూడు వంట్లుగా పంచ్చుకొనిరి గన్కు యీ గ్రామం మాణిక్యారావు వారి వంట్టులో వచ్చినది గనుకు రమణయ్య మాణిక్యరాయినింగారు శ్రోత్రియంగా అగ్రహరం జర్గించినారు. అంత్తట మూత్తిన్ సోమయాజులు గారు గతించిన తర్వాతను తత్పుత్రుడైన విశ్వేశ్వర సోమయాజులు గారు యీయ్న అన్న కొమారుడయ్ని రామేశ్వర సోమయాజులు గారికి పయ్ని వ్రాశి రమణయ్యగారు వీరి తంమ్ములయి మల్లంన్నగారు ప్రభుత్వంచెశ్ని తర్వాతను వీరి తంమ్ములయ్ని శీతంన్నగారు పయ్ని వ్రాశ్ని సోమయాజులుగార్కి గ్రామంర్సుము నావ రాసులు సమెతు శ్రోత్రీయపు దానపత్రికలు వ్రాయించ్చి యిప్పించి నడిపించ్చినారు గన్కు యీప్రభుత్వములో గ్రామాన్కు పశ్చిమ భాగమంద్దున అగ్ని హోమంచెశి ఆ స్తలమందున వనం తోట వెయించ్చిరి. స్న ౧౧౬౦ (1750 AD) ఫసలి వచ్చె వర్కు శీతంన్నగారు ప్రభుత్వం చెశ్ని తర్వాతను ఆఫసలిలోనే ఫరాఁసువారు ప్రభుత్వానకు నచ్చి న్న ౧౧౬2 (1757 AD) వర్కు అధికారంచెసిరి గన్కు పయ్ని వాశ్ని పెద్దిభొట్లు సంత్తతివాడయ్ని శీతారాముడు విశ్వశ్వర సోమయాజులు రామేశ్వర సోమయాజులు తాను గ్రామపెత్తనం చేస్తూ రుధిరోద్గారి సంవ్వ త్సరంలో గ్రామాన్కు వాయువ్య భాగమంద్దు తన పెరిట గొప్ప చరువు వేయించెను. యితని తంమ్ముడయ్ని మత్యుంజయుడు యీచెరువుకు దక్షిణ భాగమంద్దున వ్యయనామ సంవత్సరములో వనంతోట వెయించ్చెను.

స్న ౧౧౬౦ (1750 AD) ఫసలీలగాయతు ౧౧౬౮ (1758 A D ) ఫసలీ వర్కు గోపాలమాణిక్యరాయినింగారు అధికారం చెశ్ని తర్వాతను పయ్ని వ్రాశి శీతన్న మాణిక్యరాయినిం గారి కొమారులయ్ని జంగ్గన్న మాణిక్య రాయిని ప్రభుత్వములో స్న౧౧౮౨ (1772 A౨) ఫసలీ విజయనామ సంవ్వత్సరం పర్యంత్తరం అగ్రహరపు సౌంజ్ఞనే శ్రోత్రియంగా జరుపుతూ వచ్చినారు.