పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33


పాలపర్రు

కయిఫియ్యతు మౌజే పాలపర్రు సంతు నాదెండ్ల తాలూకె

చిల్కలూరుపాడు యిలాకెరాజ మానూరి వెంకట కృష్ణారావు

సర్కారు మృర్తుజాంన్నగరు.

పూర్వం యీ పద్రేశమంద్దు గ్రామం యెర్పడ్క ముంద్దు యెక్కడెక్కడనుంచ్చి పశువుల మంద్దలను తొలి తెచ్కుని యిక్కడ మంద చెర్చుకుని వుంట్టువుండె యడల తృణజల వసతిని గురించ్చింన్ని స్తలవిశేషమును గురించ్చింన్ని విస్తరించి క్షీరములు పిండ్డుతూ వచ్చి నవి గన్కు పాలపర్రు అని యీ స్థలాన్కు వాడికె వచ్చి ప్రాయశహా గ్రామముంన్ను యెర్పడి వ్యంగ్యార్ధ పాలపర్రు అని అంట్టూ వున్నారు. గజపతి శింహ్వాసనస్థుడయ్ని గజపతి మహారాజులుఁగారు రాజ్యం చెశెటప్పుడు వీరిదగ్గర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగార్ను ౧౦౬౭ (1145 AD) శక మంద్దు ప్రభువు దగ్గిర దానంబట్టి సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామకరిణికపు మిరాశిలు నిర్నయించ్చె యడల యీ పాలపర్రు అనె గ్రామానకు వెలనాడు భారద్వాజ గొత్రీకుడయ్ని రామరాజుకు ఎకభోగంగ్గా మిరాశి నిర్నయించ్చినారు గన్కు తదాది మొదలుకొని యీవరకు యెతద్వంశజులై వారు పాలపర్త్తి వారు అభిదానం చాతను అనుభవిస్తూ వుంన్నారు. సదరహి రామరాజు కరిణీకము మిరాశి అనుభవిస్తూ వుండ్డెటప్పుడు అనుముకొండ్డ శింహ్వాసనస్తుడయ్ని గణపతిదెవు యీ వెలనాటిభూమిలో యెక్కడెక్కడ శివలింగ్గప్రతిష్ఠలు చెశె కాలమంద్దు యీ గ్రామంలో గ్రామాన్కు వుత్తరభాగమంద్ను యొక ఆవరణములోనే రెండ్డు శివాలయములు కట్టించ్చి శ్రీ సూర్యెశ్వర సోమేశ్వరస్వామి వార్లు అనె లింగ్గమూర్తులను ప్రతిష్ట చెశి నిత్య నైవేద్య దీపారాధనలు జరుగ గలంద్లుకు కు ౧౨ పంన్నెండ్డు కుచ్చెళ్లు ఖండ్రికె యినాము యిప్పించ్చినారు.

తదనంతరం గ్రామాన్కుకు వుత్తరం సదరహి దేవాలయములకు దక్షిణభాగమంద్ను విష్ణుస్తలం కట్టించ్చి శ్రీ చన్నకేశవస్వామివారిని పరివారసమేతంగా ప్రతిష్ఠ చెశి యీ స్వామివారి నిత్యనైవేద్యదీపారాధనలు జరుగగలందుకు కు ౧౨ కుచ్చళ్ళ ఖండ్రికె యినాముగా యిప్పించ్చినారు.

వడ్డెరెడ్డి కర్న్నాటక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జర్గి గన్కు కర్నాటకరా జయిన సదాశివ దేవరాయలు ప్రభుత్వం చెశెటప్పుడు జంపని యర్రభొట్లు సూరుంభొట్లు గారికి యీ గ్రామం అగ్రహారం యిచ్చినారని వాడికె వున్నది. శాలివాహనం ౧౫౦౨ శకం (1580 AD) లగాయతు మొగలాయి ప్రభుత్వం వచ్చె గనుక యీ కొండ్డవీటి శిమ సంతు బంద్దిలు చెశె టప్పుడు యీ గ్రామం నాందెండ్ల సముతులో దాఖలు చెశి దేశస్తులయ్ని మాణిక్యరావువారు మానూరివారు పాతృనివారు సంతుకు చౌదర్లు అయ్ని నల్లబోతురి పరంగ్గా బహుదినములు అమాని మామిలియ్యతు జరిగించ్చినారు.