పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101

సుద్దపల్లి

కైఫియ్యతు మౌజే సుద్దపల్లి సంతు గుంట్టూరు సర్కారు

ముతు౯ జాంన్నగరు తాలూకే రాచూరు.

యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చిన్ని సుద్దపల్లి అనే పేరు వుంన్నది. గజపతి శీంహ్వాసనస్తుడయ్ని గణపతిదేవ మహారాజులు ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు బ్రాహ్మణుల్కు మిరాశీలు యిచ్చిరిగన్కు అప్పుడు యీ గ్రామాన్కు ప్రథములు కౌండిన్యస గోతృల్కు యీ గ్రామాన్కు కరిణికం యిచ్చినారు .

వడ్డెరెడ్డి ప్రభుత్వములు జర్గినతర్వాతను కన్నా౯ట్క రాజైన కృష్ణరాయులు యీ దెశం ఆక్రమించ్చి ప్రభుత్వం చెశెటప్పుడు దంట్టుదేవరాయ దీక్షితులుగారు బహు తప సంప్పంన్నులుంన్ను బ్రహ్మవిద్వాంసులు అయివుంద్దురు గన్కు విరియంద్దు కరుణించ్చి సుద్దపల్లి అగ్రహారం చెశి ధారాగ్రహితం తామ్రశాసనములు వ్రాయించ్చి యిప్పించ్చినారు గన్కు ఆగ్నిహోత్రములుతొటి కూడా అగ్రహారం ప్రవేశించ్చి గృహ నిర్మాణములు చెస్కుని నిరతాంన్నా దానపరులై అష్టభోగ సహితముగా అగ్రహారము అనుభవిస్తూ యీ గ్రామాన్కు పశ్చిమ భాగమంద్దు శివాలయం కట్టించ్చి వారి పూర్వులు కాశివెళ్ళి తిస్కు వచ్చిన లింగ్డ మూత్తి౯ని ప్రతిష్టచెశి కాశీ విశ్వేశ్వరస్వామి అని నామధేయం పెట్టి మరిన్ని గ్రామమంద్దు విష్ణుఆలయం కట్టించి శ్రీ వేణుగోపాలస్వామివారిని ప్రతిష్టచేశి యీ స్వామివాల్ల౯కు నిత్య నైవేద్య దీపారాధనుల్కు జర్గగలంద్లుకు చెశ్ని వసతులు.

 కు ౨ యీనాములు

౧ శ్రీ విశ్వేశ్వరస్వామి వాల్ల౯కి
౧ శ్రీ వేణుగోపాలస్వామి వాల్ల౯కి

౪ నవరాత్రములు, దీపావళి, ధనుమా౯సములు, సంక్రాంత్తి, శివరాత్రి, శ్రీరామ నవమి, గోకులాష్టమి వగయరా సంవత్సరముల్కు గ్రామ ఖచు౯ సాలియానా యిప్పిస్తూ వుంన్నారు.

 : ౨ శ్రీ విశ్వేశ్వర స్వామివార్కి
౨ శ్రీ వేణు గోపాలస్వామివారికి -

యీ ప్రకారంగా నిన౯యించ్చి దెవరాయ దీక్షితులు విరి కొమారులు శంభు సోమయాజులు మొదలయ్నినవారు కనా౯ట్క ప్రభుత్వం శాలివాహనం ౧౫౦౦ శకం (1578 AD) వర్కు అనుభవించ్చినారు. ఆంత్తట మొగలాయి ప్రభుత్వం వచ్చినది గన్కు అగ్రహార సౌంజ్ఞతప్పి కోర్టు (?) కింద్ద దాఖలవుట వల్లను యీ అగ్రహారీకులయ్ని