పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

గ్రామ కైఫీయత్తులు


అరకుచ్చల భూమి యినాం యిప్పించ్చి శ్రీస్వామివార్ని పూజించ్చడానకు రత్నాకరం శేషాచార్యులు అనే వయిఖానసుణ్ణి నిన్న౯ యించ్చినారు. వెంక్కట కృష్ణునింగారి ప్రభుత్వం జరిగిన మీదట యితని కౌమారుడయ్ని వెంక్కట నరసింహరావు ౯ సంవత్సరములు మయినరీలో వుండ్డి వుంన్నారు గనుక హనరేబిల్ కుంఫిణీవారు మేనేజర్లునుంచి అమానిమామ్లియ్యతు జరిగించుకుంట్టూ వున్నారు. గ్రామానికి తూర్పుభాగం ఆంజనెయులమిద్దె వున్నది. గ్రామాన్కి పడమరగా మశీదులు... పెరంట్టాలు గుడి వున్నాది.

కరణం లింగ్గరాజువ్రాలు.