పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

99

సంద్దెపూడి

కయిఫియ్యతు మౌజే సంద్దెపూడి సంతు నాందెడ్ల సర్కారు

మృతు౯జాంన్నగరు తాలూకె చిల్కలూరిపాడు యిలాఖే

రాజామానూరు వెంక్కట నరసింహారావు మయినరు జమీదారు

స్న ౧౨౨౭ (1817 AD) ఫసలీ మజ్కురి కరణాలు సంద్దె

పూడి లింగ్గరాజు నర్సరాజు వ్రాయించినది.

పూర్వం యీస్థళమందు వొంక్కారనది ముప్పగుంట్ట నదిన్ని యీ రెండ్డున్ను యీస్థళమందున్న సంధిఆయి కూడినంద్ను గ్రామానికి సంద్దెపూడి అనే వాడికె అయ్నిది. గజపతి శింహ్వసనస్తుడయ్ని గణపతి దేవమహారాజులుంగారు శాలివాహనం ౧౦౫౬ (1134 AD) శకమంద్దు పట్టాభిషిక్తుడయి ప్రభుత్వం చేస్తూవుండ్డగా విరివద్ద వుండె మహాప్రధాను లయ్ని గోపరాజురామంన్న శాలివాహనశకం ౧౦౬౭ (1145 AD) శకమంద్దు ప్రభువు దగ్గిర దానంపట్టి సమ స్తమయ్ని నియ్యోగులకు గ్రామకరణికపు మిరాశీలు నిర్ణయించ్చెయడల యీగ్రామాన్కు శ్రీవత్సస గోత్రులయిన తిమ్మయ్యకు యెకభోగంగ్గా మిరాశీయిచ్చినారు గన్కు తథారభ్యం తద్వంశజులయ్ని వారు గ్రామనామధేయం కలిగి మిరాశి అనుభవిస్తూ వుంన్నారు. శాలివాహనశకం ౧౫౦౦ (1578 AD) వరకు వడ్డెరెడ్డి కన్నా౯టక ప్రభుత్వం జర్గిన మీదట మొగలాయి ప్రభుత్వం వచ్చెను గన్కుమల్కి. విభురాంపాదుషాహావారు దెశం ఆక్రమించ్చుకాని సముతు బంద్దిలు పరగణాలు నిర్ణయించ్చె యడల యీగ్రామం నాదెండ్ల సముతులో దాఖలు చేశి సముతు అమీళ్లు, చవుదర్లు, దేశపాండ్యాలు పరంగ్గా అమాని మామ్లియ్యతు జరిగించుకుంట్టూవుండ్డె యడల మహ్మదుఖానుడనె ఆమీలు యీగ్రామానకు ఆగ్నెయభాగమంద్దు మశీదుకట్టించినారు. సదరహి శకం లగాయతు స్న ౧౧౨౦ ఫసలీ (1711 A.D) వర్కు మల్కి విభురాం మొదలయ్ని పాదుషాహాలు అమీని మామ్లియ్యతు జర్గించ్చినారు స్న ౧౧౨౨(1712 A.D) ఫసలీలో కొండ్డవిటిశీమ మూడు వంట్లుచెశి సుమబరిదుఖాను (?) బహదరుగారు జమీదాల్ల౯కు పంచ్చిపెట్టె యడల యీ గ్రామం సర్కారు మజ్ముందారు అయ్ని మానూరి వెంక్కన్న పంత్తులుగారి వంత్తు వచ్చి చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు చేశిరి గన్కు తదారభ్యం వెంక్కన్నపంత్తులు, అప్పాజీ పంత్తులు, వెంక్కట్రాయునింగారు, వెంక్కట కృష్ణునింగారు, నరసన్నగారు ప్రభుత్వం చెశ్నీ తరువాతను, వెంక్కట కృష్ణునింగారు స్న ౧౨౧౯ ఫసనిలో (1809 A.D) ప్రభుత్వానికి వచ్చి స్న ౧౨౨౨ (1812 AD) ఫసలి వర్కు ప్రభుత్వం చెశినారు. స్న ౧౨౧౦ ఫసలీ (1800 AD) రౌద్రిసంవ్వత్సరములో సదరహి నరసన్నారావు గ్రామానికి ఆగ్నేయ భాగమంద్దు దేవాలయం కట్టించ్చి శ్రీఆంజ్జనేయస్వామివార్ని ప్రతిష్ఠచెశి నిత్యనై వేద్య దీపారాధనలు జర్గగలందులకు