పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

గ్రామ కైఫీయత్తులు


వార్కి కరణీకము హోదా యెప౯డినది, యీ కొండ్డవిటి శిమ సముతు బంద్దిలు చెశెటప్పుడు యీగ్రామం గుంట్టూరు సముతులో దాఖలు చెళి సంతు అమీలు దేశ పాండ్యాల పరంగ్గా అమాని మామ్లియ్యతు జర్గించినారు. స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD) లో కొండవిటి శిమ వంట్లు చెశి జమీదాల్ల౯కు పంచ్చి పెట్టె యడల యీగ్రామం రమణయ్యా మాణిక్యారాయునింగారి వంట్టులో వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యగారు, మల్లంన్నగారు, శీతంన్న గారు, గోపన్నగారు స్న ౧౧౬౮ ఫసలీ (1758 AD) వర్కు ప్రభుత్వం చెశిరి. శీతంన్నా మాణిక్కారాయునింగారి కొమారులయ్ని జంగ్గన్నా మాణిక్యారాయునింగారు ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౧౮౨ ఫసలీ (1772 A D) వర్కు ౧౪ సంవత్సరములు ప్రభుత్వం చెశ్ని మీదట తంమ్ములయ్ని తిరుపతి రాయునింగారు తాలూకా సఖం పంచ్చుకున్నారు గన్కు యీగ్రామం తిరుపతి రాయునింగారి పరమై రాచూరు తాలూకాలో చెర్నిది గన్కు తిరుపతి రాయునింగారు వీరి కుమారులయ్ని అప్పారాయునింగారు, శీతంన్నగారు స్న ౧౨౦౮ (1798 A D) ఫసలీ వర్కు ప్రభుత్వం చెశి నిస్సంత్తుగా పోయిరి గన్కు జంగ్గన్నగారి కుమారులయ్ని భావన్న మాణిక్యారాయునింగారు స్న ౧౨౧౧ ఫసలీ (1801 AD) వర్కు ప్రభుత్వం చెశ్ని మీదట స్న ౧౨౧౨ఫసలీ (1802 AD)లో మహరాజ్యశ్రీ కుంఫిణీ వారు రాచూరి తాలూకా వెలాం వెశినంద్దున రాజా మల్రాజు వెంక్కట గుండ్డారాయునింగారు కొనుక్కుని యిదివర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

రిషకుఁ గ్రామ గుడికట్టు కుచ్చళ్ళు ex కిమ్ని హాలు " గ్రామ కంఠం రాతి గనులు పఁట్టకు పనికిరాని భూమి చెరువులు కి దంటువారి చరువు గ్రామాన్కు తూరుపు భాగమందు గ్రామాన్కు పశ్చిమం రాయప్రోలి బ్రాంహ్మభొట్లగారి చెరువు మయిల గంగయ్య అనే గొల్లవాడు గ్రామాన్కు వుత్తరం తవ్విం చ్చిన చెర్వు శాఫర చెరునారప్ప అనే బ్రాంహ్మడు గ్రామాన్కు వాయువ్య భాగమఁద్దు తవ్వించ్ని చెరువు. కు ట్టలు ౧౦కి జల్ల انه