పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

గొడవర్రు

కయిఫియ్యతుమౌజే గొడవర్రు వ॥ గుండ్లవరం సంతు గుంట్టూరు

సర్కారు ముతు౯ జాంన్నగరు తాలూకే రేపల్లె వ॥ రాచూరు

శ్రీ గణేశాయనమః| నమస్తుంగ్గశిరఃచ్చుంబ్బి'
చంద్రచామరిచారితే। త్రైలోక్య నగరారంభ
మూల స్తంభాయశంభవే॥

1. శ్లో॥ నమస్తుంగశిరశ్చుంబి చంద్రచామర చాలితే
త్రైలోక్యనగరారంభ మూల స్తంభాయ శంభవే ॥

తా॥ ఇది యీశ్వరస్తుతిః॥ శిరోభూషణముగానున్న చంద్రుడని వింజామరచే విసరబడు చున్నవాడును - ముల్లోకముల దృష్టికి మూల స్తంభమైన శంభునకు నమస్కారము -

2. శ్లో॥ హరేరిలోకతా రస్యదంష్ట్రాద ...పాతువః|
వేమాద్రి కలశాయత్ర ధాత్రి శ్చాత్ర శ్రియంద...౹౹

  • శ్లో॥ హరేర్వేలోల తారస్య దంష్ట్రాభాసశ్చపాతువః ॥

హేమాద్రి కలశాయత్ర ధాత్రిర్యత్ర శ్రీయందధుః!--అది వరాహాస్తుతి

తా॥ కదలాడు కనిగ్రుడ్లు గలిగినట్టి విష్ణుమూర్తి వరాహావతారము నెత్తి యుండ నాయన దంతకాంతులు మిమ్ము రక్షించుగాక! మేరుపర్వత శిఖరములు - భూమియునే విష్ణు దంష్ట్రాంకురములపై నుండెనో ఆ పరమాత్మయని భావము-

3. శ్లో॥ కళ్యాణౌనాయాస్తుతద్ధామ ప్రత్యూహతి మిరాపహం|
యద్గజోప్య గజోద్భుతం: హరిణాపిచ పూజ్యతే॥

  • శ్లో॥ కల్యాణాయాస్తుతద్ధామ ప్రత్యూహ తిమిరాపహమ్।

యద్దజోప్యగజో ద్భూతం హరిణాపిచపూజ్యతే॥ -గజపతిస్తుతి

తా॥ ఏమహాత్ముడు గజముఖుడయ్యు అగజాసుతుడు (పార్వతీ తనయుడు) అయ్యెనో, హరిహరాదులకు గూడ పూజ్యుడయ్యెనో అట్టివిఘ్నతిమిర హరియైన వినాయకుని తేజస్సు కల్యాణ ప్రదమగుగాక ౹

4. శ్లో॥ అస్తీహరమయాడ్డేవై ర్మబ్యమానం న్నవాంబ్బు థెః|
నవనీతమిచోద్భూత| మవనీతతమోపహః౹

  • శ్లో॥ఆసీత్సహరమాదేవ్యా మద్య మానోనవాంబుదై :౹

నవనీతమివోద్భూతం అవనీగతమోపహం ౹౹