పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

గ్రామకై ఫీయత్తులు


వెంక్కన్న పంత్తులు అగ్రహారీకుల మీద గిట్టమి చాత అగ్రహారములు నడుపకుండ్డా చేశినారు గనుక సదరహీ అగ్రహారీకులు కరిణిక యాజమాన్యత్వంలో వుంట్టూ వుండ్డిరి సదరహి ఫసలీ లగాయతు స్న ౧౧౮౨ ఫసలీ (1772 AD) పర్కు జంగ్గంన్నగారు ప్రభుత్వం చేస్తూ వుండ్డగా యితని తంమ్ముడైన తిరుపతి రాయణింగారు కల్తపడి తాలూకా చరిసఖం పంచుకునే యడల గండ్డవరం అగ్రహారం రాచూరి తాలూకాలో దాఖలు అయి తిరుపతి రాయుణింగారి వంత్తుకు వచ్చినది. గొడవర్రు మాత్రం రేపల్లె తాలూకా క్రింద జంగ్గన్నా రాయుణింగారు ప్రభుత్వం చెశ్ని మీదట యీయన కొమారుడయ్ని భావన్నా మాణిక్యరాయినింగారు ప్రభుత్వానకు వచ్చి సదరహి గ్రామంలో ప్రభవ సంవ్వత్సరమంద్దు ఆలయం కట్టించి మల్లేశ్వరుడనే లింగమూత్తి౯ని ప్రతిష్ఠ చేశి చేబ్రోలు యోగానందం అనే పూజార్ని అచ౯కత్వానికి నిన్న౯యించ్చి యీద్ధేమునికి నిత్యనైవేద్యదీపారాధనలు జర్గుగలందులకు కుచ్చల పొలం యినాం యిప్పించినారు గనుక జర్గుతూ వున్నది. కాళయుక్తి నామసంవత్సరములో మజ్కూరికాపు అయ్ని మంకెన కొండ్డప్ప అనే అతను గ్రామమధ్యమంద్దు విష్ణు స్థలం కట్టించి శ్రీ వేణుగోపాలస్వామి వార్ని ప్రతిష చేసి పుసులూరి శేషయ్య అనే విఖనసుణ్ని అవ౯కత్వానకు నిన౯యించ్చి యీద్దేమునికి నిత్య నైవేద్య దీపారాధనలకు కుంచల పొలం యినాం యిచ్చినారు. తిరుపతి రాయినింగ్గారి ప్రభుత్వం వచ్చిన మీదట సదరహీ నిన౯య ప్రకారం దేవబ్రాహ్మణ వృత్తులు జరిగిస్తూ వచ్చినారు తదనంతరం యీయన కొమారుడయ్ని అప్పారాయనింగారు శీతంన్నారావు వీరు స్న ౧౨౦౮ ఫసలీ (1798 AD) వర్కు ప్రభుత్వం చేశి సంత్తతి లేకపోయినంద్ను స్న ౧౨౧౧ ఫసలీ (1801 AD) లో యీ రాచూరి తాలూకా హాసరేబిల్ కుంఫిణీవారు యాలం వేయించివారు గన్కు రాజా మల్రాజు వెంక్కట గుండ్డారాయుణింగారు కొనుక్కొని సదరహీ ఫసలీ లగాయతు స్న ౧౨౨౮ ఫసలీ (1818 AD) వరుకు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.