పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

71


హైదరాబాదు నుండి శ్వామలదాసు అనే గుజరాతీ సావుకారు కుటుంబ సహితంగ్గా వచ్చి యీ జగ్గన్న గారి అనుమతిమీద యీగుంటూరుకి వచ్చి యూ గుంటూరికి యీశాన్య భాగమంద్దు యిండ్లు కట్టి అగ్రహారం యేర్పరిచి యిరువయినాలుగు మంది బ్రాంహ్మణులను వుంచి వారికి వెల ౧ కి అయిదు రూపాయిలు పాలు యిస్తుంన్ను వున్నందువల్ల శ్యామదాసు అగ్రహారయనింన్ని రూఢిపడినది.

ఆమీదట యీజంగన్న గారు కొన్ని దినములు ప్రభుత్వం చేశి యీయన పడిపోయే టప్పుడు యీయన కొమారుడు అయిన రెడ్డి వెంకటాద్రి నాయడు మూడు సంవత్సరములవాడు గనక యీయనను దగ్గరవుంచుకొని యీజంగన్నగారికి జనక సంమ్మంధమయిన తమ్ముడు రామన్న గారు ప్రభుత్వం చేస్తూవుండగా వెంకటాద్రి నాయనిగారికి పద్దెనిమిది సంవత్సరములు అయిన తదనంతరం రామన్నగారు యీవెంకటాద్రి నాయనింగార్కి తమ వ్యవహారం యావత్తు వప్పగించి, తన కొమారుడయ్ని పాపయ్య గారిని తంమ్ముడు కొమారుడయ్ని మోళయ్యగారిని వ్యవహారస్తులును సరదార్లు మొదలయ్ని వెంకటాద్రి నాయనింగారికి ముద్రికనిచ్చి అప్పగింత పెట్టి తాము శరీరం చాలించినారు.

తదనంతరం శాలివాహన శక వరుషంబులు ౧౭౦౪ (1782 AD) వెంకటాద్రి నాయనింగారు ప్రభుత్వానికి యేర్పడి ప్రభుత్వం చేస్తున్ను సుఖావారి వ్యవహారంవున్న మట్టుకు వారికి సహాయం చేస్తున్న వారి వ్యవహారం చక్క పెట్టుతున్ను వుండగా అనుగ్రహం మన్నే సులతాను బహదరు అనే ఖితాబున్నుయిచ్చి యింకా ఆనేక బహుమతులు యిచ్చి నడిపించినారు. ఆమీదట కుంపిణీవారి అనుగ్రహం వల్ల అనేక పాశ్యాలు జయించి వారి అనుగ్రహం సంపా యించుకొని యిప్తిదాయలగాయతు ముపై అయిదు యేండ్లు ప్రభుత్వం చేశినారు. ఆమీదట శాలివాహన శక వరుషంబులు ౧౭౩౧ అగునేటి విళంబి సంవత్సరం యీగుంటూరి కాపరస్తుడు చమిట వెంకయ్య అనే వాడు యీ గుంటూరి అగస్తేశ్వర స్వామివారి గుడికి యీశాన్యభాగ మందు కళ్యాణ మంటపం కట్టి శాసనం వేశినాడు.

యిప్పుడు యీఅగస్తేశ్వర గోపాలస్వామివారికి కుచళ్లు పొలం నిత్య నైవేద్యానికి నడిపిస్తున్నారు.

మొగలాయీ ఆయిన పిమ్మట హైదరాబాదు సుభావారి తరపునుంచి యీముర్తుజాం నగరానికివచ్చిన హాపీబుల తహశీలు పేర్లు:

హపీబుల తహశీలు పేర్లు :

౧ రాజబాలకిషన్
౧ జాతిజతి బెగు
౧ యిసమొహద్దినుఖాన్
౧ మస౯ మ్మవ౯ఖాన్
౧ మొహతరింఖాన్
౧ సహెబుజాదా
౧ వరజుల్లాఖాన్
౧ ముళ్యెమరత౯ము శెలల్లి పరాశీలు
౧ యెపురా పాదుషా
౧ నవాబు హసనల్లి ఖాన్
౧ మీరుయిసమలీఖాన్
౧ మీరు అబ్జాను షా
౧ షకురుల్లాబెగు

వీరి దినాలలో కోకోణి కొక్కిట్టినది.