పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

గ్రామ కైఫియత్తులు


జమీందారి సంపాయించుకుంన్నారు. తదనంతరం యీయన కొమారుడయిన వారిరెడ్డి పెద రామంన్నగారు నందిగామ శీమ జమిందారు అనుభవిస్తున్ను రాయల అనుగ్రహం నిందాసంపాయించుకొని వారినుంచి బందరు సర్కారులో పెనకంచి, చేబ్రోలు శీమలు కూడా జమీందారు యేర్పరచుకొన్నారు. తదనంతరం మొగలాయి అయిన పింమ్మట హిందుస్తానం నుంచి మొగలాయి వాండ్లువచ్చి రామదేవరాయలతోటి యుద్ధంచేశి జయించి విజయనగరం తీసుకొని యీకొండవీడు, వినుకొండ, బెల్లంకొండ మొదలయ్ని దుర్గాలలో త్మఠాణా పుంచుకొని గోలకొండ ముఖాం యేర్పరుచుకొని వుండగా యీయన కొమారుడయిన చినపద్మనాభునింగారు హైదరాబాదులో వుండె సుభావారివద్దకిపోయి వారిని అనుసరపక్షం చేసుకుని వారి కార్యభాగాలలో తిర్గుతున్ను వుండి వుండగా గోలకొండలో వుండే షహఅలం-పాదషా వారికి యితని యందు నిండా యనుగ్రహంవచ్చి యీ కొండవీడు వినుకొండ బెల్లంకొండ శీమలు జమీదారి వాశియిచ్చి సదరు వాలు దయచేయించి నందువల్ల అదే ప్రకారం యితను సదరిహి పాదుషహవారి చాత అనుజ్ఞ పుచ్చుకొని యీకొండవీటికివచ్చి జమీదారి చేస్తుంస్సు సుభావారికి పేషకను యిస్తు యిరువయి సంవత్సరములు ప్రభుత్వం చేశినారు తదనంతరం యితని పెంపుడు కొమారుడు అయిన చుబ్బ రాఘవయ్యగారు ప్రభుత్వానకు యేర్పడి ప్రభుత్వం చేస్తూవుండగా గోలకొండ సుభావారి తరపున ముసామరతన్, పరాసే మహాలల్లి అనే యిద్దరు పరాశిలు వచ్చి యీకొండవీటి శీనుతో త్మఠాణావేస్కుని యీగుంటూరులో ప్యాట యేర్పరచి యీప్యాట మధ్యమందున ఆరు బురుజుల ఖిల్లా కట్టుకొని అభిల్లాలో వుండి కొన్ని దినాలు అధికారం చేసినారు. అప్పుడున్ను సదరహి చుబ్బరాఘవయ్య జమీదారి చేస్తున్ను యీమిరాశిలో కుండాసుభావారికి పేషకసుయిస్తూ వుండేను. తదనంతరం అతని అన్న అయిన చంద్రమవుళిగారు ప్రభుత్వాన్కి యేర్పడి జమీదారి చేస్తుంన్నూ వుండి యీకొండవీడు వినుకొండ బెల్లంకొండ వగై రా శీమలు భరించేటందుకు శక్తిల్యాక యీ కొండవీడు శీమ మూడు వంట్లుచేశి మానూరివారు మాణిక్యరావు వారికి ౨ రెండు వంట్లుంన్ను వకవంటు తాముంన్ను పుచ్చుకొని యీప్రకారంగా కొన్ని దినములు ప్రభుత్వం చేసినారు.

శాలివాహన వర్షంబులో ౧౬౪ం అగునేటి(1718A.D) హేవళంబి నామ సంవత్సరమందు యితని తంమ్ముడయిన రామలింగన్న గారు జమీదారి ప్రభుత్వం చేస్తువుండగా అపుడు యీగుంటూరి చుట్టును కేవల అరణ్యంగా వుండేది. అప్పుడు సదరహి పేద రామలింగన్నగారు యీఅరణ్య యావత్తున్ను సదరించి యీగుంటూరికి పశ్చిమభాగమందు రామచంద్రపురమనే ఆభిదానంచాతవక అగ్రహారం కట్టించి దక్షిణ దేశాల నుంచి అనేక గోత్రబ్రాంహ్మణులు పిలిపించి వాండ్లకు సర్వాగ్రహారంగా యిచ్చి మరిన్ని అనేక మందికి యీశీమలో వృత్తి స్వాస్యాలు యిచ్చినారు. యీరీతిగా యీ పెదరామలింగన్నగారు వారి శాలివాహన శక వరుషంబులు ౧౬౬౦ దాకా జమీయేలినారు. తదనంతరం యీయన అన్న అయిన సూరంన్న గారు రెండ్డు సంవత్సరములు భూమి చేశినారు. వారీ తదనంతరం వారి జేష్ట అయిన చిననరసంన్న గారు యేడు సంవత్సరములు జమీ అనుభవించినారు. ఆమీదట యీయనతమ్ములయిన చినరామలింగన్న గారు ప్రభుత్వాన్ని ఆరంభించి భూమి చేస్తూవుండగా పూర్వంన ప్రకారం యీశీమ యెధావిధిగా సమస్త పూజోత్సవములుంన్ను భూమి యీరీతిగా పన్నెండు సంవత్సరములు జమిచేసినారు. తదనంతరం యీయన పెంపుడు కొమారుడయ్ని జంగన్నగారు ప్రభుత్వం చేస్తూవుండగా యీశాలివాహన శక వర్షంబులో ౧౬౮౨ లో (1760 A.D)