పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
84

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

కొలదికాలములో హేన్రీ రాజుకు పోపుతో కలహము గగెను. హేన్రీరాజు తనభార్యయగు కాథరిన్ ను విసర్జించి. వేరు స్త్రీని వివాహమాడ దలచెను. కాధరిన్ తోడ జరిగిన వివా హము విచ్ఛేదము చేయుమని పోవును కోరెను. పోపు సమ్మ తించలేదు. అందుపై రాజు పోపు నెదిరించి తన దేశముమీద పోవుకు అధికారము లేదనెను. రాజు తన దేశములోని క్రైస్తవ దేవాలయములలోని ఆరాధనలో కొన్ని సంస్కరణములను గావించెను. ఇంగ్లాండులోని మత గురువు లెవరును పోపుకు లోబడ గూడదనియు, ఐహిక విషయములలో వలె మతవిషయ ములలో గూడ రాజే సర్వాధికారియనియు శాసించెను. దేశములోని ప్రధానమతాచార్యునిచే కాధరిన్ వివాహము విచ్ఛేదము గావించుకొనెను. ఇంగ్లాండులోని అనేకములగు రోమన్ కాథలిక్ మఠములను దోచుకొని వానిని నాశనము చేసెను. గొప్ప విద్వాంసులగు మూరు, పిషరు మొదలగు వారును పెక్కు మంది రోమన్ కాథలిక్ లును పోపుకు బదులుగా రాజ యొక్క నిరంకుశాధికారమును మతవిషయములలో సంగీ శరించ నందున మరణశిక్షలకు లోనైరి. రాజు రోమన్ కాథ లిక్ మతము నుండి మారెనే గాని తన దేశములోని నూతన సంస్కరణములను లూథరుకాల్విన్ గార్ల సిద్ధాంతములతో పాటు చేయలేదు. 1589 వ సంవత్సరమున రాజు ఆరు సిద్ధాంతములను నందరును నమ్మి తీరవలెననియు, నమ్మని వారు మంటలలో పడవేసి చంపబడుదు రనియు శాసించెను, అనేకులు మంటల కాహుతియైరి. మత గురువులు వివాహ మా