పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

85

ఏడవ అధ్యాయము


డరాదనికూడ శాసించెను. బైబిలుకు నింగ్లీషు తర్జుమా చేయిం చెను. ఈయన చేసిన యేర్పాటులు రోమణ కాథలిక్కులకును ప్రొటెస్టెంటులకును అసంతృప్తికలుగజేసెను.


ఈయనకుమారుడగు ఆరవ ఎడ్వర్డు రాజు కాలమున ప్రొటెస్టెంటు మతము బాగుగ వ్యాపించినది. చాలవరకు తక్కి న దేశములలోని ప్రొటెస్టెంటు సిద్ధాంతము ,లమలులో పెట్ట బడెను.


తరువాత రాణియైన మేరి దృఢమైన రోమన్ కాథలిక్కు, అయి స్పెయిన్లో రాజుగు రెండవ ఫిలిప్పును వివాహమాడి ప్రొ టెస్టెంటులను తండోపతండములుగ మంటలలో పడవేయించి చంపి వేయించెను. ఈమే తరువాత రాజ్యమునకు వచ్చిన ఎలి జెబెత్తు ప్రొటెస్టెంటు అయ్యెను. లూథరు, కాల్విన్ సిద్ధాంత ములను పూర్తిగ నవలంబించని ప్రొటస్టెంటు మతము యిం గ్లాండులో స్థాపించబడినది, దీనికి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు అని పేరు. రాణీచేసిన యేర్పాట్ల ప్రకారము తప్ప వేరువిధమైన యెట్టి ఆరాధనయు నింగ్లాండులో జరుగరాదని 1558 వ సం వత్సరమున శాసించినది. రాణిచే స్థాపించబడిన దేవాలయము లకు రాని వారికి గొప్ప జుల్మానాలు వేయబడెను. అనేక మంది రోమన్ కాథలిక్కులు చంపబడిరి. ఎవరినై నను రోము ను కాథలిక్కు మతము లోనికి చేర్చుకొనిన వారికి మరణశిశు విధిం పబడెను. కొంత కాలమయిన తరువాత తీవ్రమగు ప్రొస్టెంస్టె టులుకూడ మరణశిక్షలకు లోనయిరి. ఐర్లాండురోని రోమను కాథలిక్కులను ఎలిజబెత్తురాణి పెట్టిన హింసలు, విధించిన