పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

ఏడవ అధ్యాయము

ము చేసికొనెను, వారు ఎచటను ఆరాధన జరుపుకొనుటకు వీలు లేదని శాసించెను. నయముననో భయముననో చాల మందిని రోమను కాథలిక్కు మతములో చేర్చెను. మిగిలిన వేలకొలది ప్రొటెస్టెంటులు ఇంగ్లాండు, హాలండు, జర్మనీ దేశ ములకు పారిపోయిరి. ఫ్రాన్సు దేశములో ప్రొటెస్టెంటు మతము లేకుండ చేయబడెను.

6

జర్మినీలో ముప్పది
సం.ల యుద్ధము

జర్మనీలో కొందరు రాష్ట్రాధిపతులు ప్రొటెస్టెంటులును, తక్కినవారు రోమను కాథలిక్కులును నయిరి. చక్రవర్తి రోమను కాథలిక్కు మతస్థుడై ప్రొటెస్టెంటు' రాష్ట్రాధిపతులతో యుద్ధము చేయుచు వచ్చెను. కొంతకాలము వరకు సంధి జరిగెను. తిరిగి, 1594 "మొదలు 1624 వరకు ముప్పది సంవత్సరముల కాలము ఎడ తెగక రోమసు కాథలిక్కులకును ప్రొటెస్టెంటులకును తీవ్ర మైన యుద్ధము జరిగెను. ఒకరి నొకరు ఘోరవధలను గావిం. చుకొనిరి. జర్మనీదేశ మీ యంతఃకలహములవలస మిగుల క్షీణించెను. (ఈ ముప్పది వత్సరముల యుద్ధమును గూర్చి, కొంచెము విస్తారముగా రెండవ సంపుటములో జర్మనీని గూర్చిన అధ్యాయమున వ్రాయబడినది.)

(7)

ఇంగ్లాండులో మత
స్వేచ్ఛ లేకుండుట,

మతసంస్కరణమునందు ఇంగ్లాండు దేశము మూడవ త్రోవతొక్కినది. ఎనిమిదవ హెన్రీరాజు ప్రథమమున లూథరు రు యొక్క సంస్కరణములను ఖండించుచు వ్రాయగా పోపు రాజును మెచ్చుకొనెను.