పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

73

ఏడవ అధ్యాయము

(2)

ప్రొటెస్టెంటు
మతస్థాపన,

మహామహుడగు మార్టిను లూథరు జర్మనీలో ప్రొట స్టెంటు మతమును స్థాపించెను. యూరపుఖండములోని క్రైస్త వమతమున కంతకును రోములోనున్న పోపు ప్రథాన మతాచార్యుడుగా నుండెను. పోపు లేమి, మతగురువు లేమి శాశ్వత బ్రహ్మచారులుగా నుండిరి. పోపులలో కొంద రింద్రియవ్య సనములలో చిక్కి మిగుల అవినీతిపరు లుగ నుండిరి. తమ బంధువులకు విశేషముగ సహాయము చేయుచుండిరి. 1517 సంవత్సరమున పోపు పదియవలియో రోములో నొక గొప్ప దేవా యము కట్టించుచుండెను. దానికి సొమ్ము కావలసియుండెను. పోపు, పాపములు క్షమించబడె ననియు, స్వ ర్గద్వారములు తెరువబడుననియు వ్రాసి దస్కతు చేసి కాగితములు అమ్మకమునకై పంపెను. జర్మనీలో నీపాప క్షమాపణటిక్కెట్ల సమ్ముచుండగా మార్టిన్ లూథరను జర్మన్ సర్వక ళాశాలలోని పండితు డాక్షేపించి ఖండినమును వ్రాసె సు. ఈటిక్కెట్లు కొనినవారు ఎట్టిపాపములు చేసినను నరక భయము లేదని భావించసాగిరి. ఇట్టి అవినీతికరమైన మూఢాభి ప్రాయములను ప్రజలలో వ్యాపింప జేయుట పోపు యొక్క గొప్పతప్పిదమని వ్రాసెను. అప్పటికి క్రైస్తవమతములో ప్రబలి యున్న ఇంకను కొన్ని మూఢ నమ్మకములను, మతగురువులలో ప్రబలియున్న అవినీతివికూడ మార్టిన్ లూథరు ఖండించెను, పోపు మార్టిన్ లూథరును క్రైస్తవమతము నుండి వెలివేసెను. పోపు పంపిన బహిష్కారపత్రికను . లూథను తగులబెట్టెను,