Jump to content

పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఆటలీలో
యుద్ధములు

పదునొకొండవ లూయి తరువాత 8వ హేన్రీ రాజ్యము నకు వచ్చెను. అప్పుడు ఇటలీ దేశములోనున్న రాష్ట్రములు తమ లో తాము పోరాడుచు, నొక రాష్ట్రము వారు , ఫ్రెంచి రాజు యొక్క సహాయమును కోరిరి. ఎనిమిదవ హెన్రీ ఫ్రెంచి సేనలతో ఇటలీ దేశము పై దండెత్తి కొన్ని రాష్ట్రముల నాక్రమించెను. "ఫ్రెంచివారు బలవంతుల గుట కిష్టము లేక ఫ్రాస్సుకు వ్యతిరేకముగ స్పెయిన్ దేశపురా జును, ఆస్ట్రియాచకవ ర్తియు బయలు దేరి వచ్చిరి. ఫ్రాన్సు రాజు లగు ఎనిమిదవ 'హెన్రీ, పండ్రెండవలూయి, "మొదటి ఫ్రాన్సిసు రాజుల కాలమున ఇటలీలో ఫ్రాన్సుకును, ఆస్ట్రియా చక్రప ర్తికనీ, స్పెయిన్ రాజునకును యుద్ధములు జరిగెను. కొన్ని జయము లపుడపుడు పొందినను ఫ్రెంచి రాజులే మొత్తముమీద నోడి పోయిరి. 1494 మొదలు 1550 సంవత్సరమువరకు నియు ములు కొద్ది విరామములతో జరుగుచుండెను. 1518 వ సంవ త్సరమున పరాసుదేశములో ఇంగ్లీషువారికుండిన "కలే" -పట్టణమును ఫ్రెంచివారు లాగికొనినిరి. 1559 వ సంవత్సరమున ఇటలీలోని యుద్ధములు కాటు కేంబ్రాసిసు సంధి వలన ముగి సెను. ఇందువలన ఫ్రాన్సునకు ఈశాన్యమునసున్న మెట్టు, టూలు, వర్ధ ప్రాంతములు వశము చేయబడెను. ఇటలీ దే శము విదేశీయుల పాలనము క్రిందికి వచ్చెసు. స్పెయిన్ రాజుకు ఇటలీలోని కొన్ని ముఖ్య రాష్ట్రములు స్వాధీనమయ్యెను. కాని స్పెయిన్ కును, ఫ్రాన్సుకును మధ్య శాంతి కుదుర లేదు. రెండు వందల సంవత్సరములవరకును. స్పెయిన్ ఫ్రాస్సు దేశములు కలహించుచునే యుండెను.