పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
66

ప్రెంచిస్వాతంత్ర్య విజయము

బసు మూడునౌకల తోడను, ఎనుబది యెనిమిది మంది సహచరుల తోడను బయలు దేరి అట్లాంటికు మహాసముద్రమున సూటిగా, పడమరగా రెండు నెలల తొమ్మిదిరోజు లొకే వైపున నడిసము ద్రములో ప్రయాణము చేసి అక్టోబరు 12 తేది యుదయమున స్పెయిన్ ప్రభుత్వపు పతాకములతో నొక నూతన ప్రపంచమున దిగెను. కాని అది హిందూదేశమువలె లేదు. హిందూదేశము సుగూర్చి తాను వినిన లక్షణము లేవియు సచట కానరావు. తాను దిగినది ద్వీపములు. అక్కడ మోటువారు నివసించి యుండిరి. హిందూ దేశములో నున్నటుల ఉత్కృష్టమగు నాగ రికతచెందిన ప్రజ లచట లేరు. కావున నీ నూతనపు దేశము నకు పశ్చిమయిండియా ద్వీపములని పేరిడెను. అచటి ప్రజలు తామ్రవర్ణము గలవారు. వారికి నెర్రయిండియనులని పేరు వచ్చెను. ఇండియా (భరతపర్షము) కొరకు అన్వేషించుటలో నీప్రదేశ ముసకు చేరుటవలన దీనికి పశ్చిమఇండియా అనియు, ఇచటి ప్రజలకు నెర్రయిండియనులనియు పేర్లు పెట్టబడెను. కొలంబసు ఆ ద్వీపములను స్పెయిన్ రాజు నకు ప్రతినిధిగా పాలిం చెను. ఇదియే అమెరికాఖండమునకు ప్రథమమున యూరపు ఖండవాసులు చేరుట. పశ్చిమ ఇండియాద్వీపములు అమెరికా ఖండములో చేరిన ద్వీపములు. స్పెయిన్ దేశమునుండి అనేకు లీద్వీపములలోనే గాక అమెరికాఖండమునకును పలసవచ్చి నివసించిరి. అమెరికా యొక్క నూతన భాగములలో చేరుచు నాక్రమించుచు వచ్చిరి,