పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67

అఱవ అధ్యాయము

హిందూ దేశము
చేరుట

ఇంతలో పోర్చుగీసువాడగు వాస్కోడ గామా 1498 వ సంవత్సరమున ఆఫ్రికాఖండము యొక్క దక్షిణ భాగమును చుట్టి హిందూ దేశములోని పశ్చిమతీర మనసున్న కళ్ళికోట చేరెను. ఈప్టు కుత్తరమున సూయజు కాలువ తవ్వబడు వరకును యూర పుఖండమునుండి ఆసి.కూకు వచ్చుటకు ఆఫ్రికా ఖండమును చుట్టివచ్చుటయే ప్రధానమైన త్రోవగ నుండెను.


ఆసియాను చేరుటకు ఇంకను కొన్ని త్రోవలు కనుగొను టకు మరికొందరు ప్రయత్నించిరి. రుష్యాలోని యుత్తరభాగ ముగుండ ఆసియా యొక్క యుత్తర భాగము చేరుటకు యత్నిం చిరి. ఇది అతిశీతల ప్రదేశమై మచుగడ్డలతో కప్పబడి ప్రయో, కారి కాలేదు. కొందరు ఉత్తర అమెరికాకు పడమరగా బయలు దేరి కొంతవర కువచ్చి మరలిపోయిరి. ఇతరులు దక్షిణ అమెరికా నుండియు, మరికొందరు పనామా జలసంధి గుండను పోవ యత్నించిరి. ఈ ప్రయత్నములు జయప్రదములు కాకపోయినను ఆఫ్రికా అమెరికా ఖండములలో చాలభాగము యూరపియను జాతులకు బాగుగా తెలిసెను. పదునారవ శతా బ్దాంతమువరకును ఆస్ట్రేలియా తప్ప మిగిలిన అన్ని ఖండము లును యూరపియునులకు తెలిసెను.

4

యూరపియను
జాతులు
వ్యాపకము

.

యూరపియనుజాతులలో నూతనప్రదేశములను కనుగొనుటలోను, ఆక్రమించుటలోను వర్తకము చేసికొను టలోను ముందంజ వేసినవారు స్పెయిను వారును,పో ర్చుగీసు వారును. వర్తకలాభము కొరకును, రాజ్య స్థాపనకొరకును వీరుభయులలో పోరాటములు కలి