పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65

ఆఱవ ఆధ్యాయము

ఆఫ్రికాను
కనుగ"గుట

సముద్రముల మీద ఆసియాకు చేరుటకు తోవలకై తెల్లజాతులవారు ఆరు వైపుల నుండి వెదకిరి. హెన్రీరాకుమారుని నాయకత్వము క్రింద పోర్చుగీసు వారు ఆఫ్రికా ఖండము యొక్క పశ్చిమ తీరమున దక్షిణముగ చాలవరకు ప్రయాణము చేసిరి. కొంచెము కొంచెముగా అప్రికా ఖండము యొక్క సంగతి వీరికి తెలియ సాగెను. తదకు 1483 సం||మున డయ్యజు అనువాడు ఆఫ్రికాఖండము నకు దక్షిణాగ్రమున సున్న గుడ్ హోఫ్ అగ్రమును చేరెను. ఇం కను ఆపైన కనుగొనవలసినది చాలగలదని తెలిసికొని వెనుకకు వెళ్ళెను.

అమెరికాను
కనుగొనుట

ఇటలీలోని జినోవాకాపురస్థుడగు కిష్టపరు కొలం' బసు సూటిగ అట్లాంటికు మహా సముద్రముగుండ పడమరగా ప్రయాణము చేసినచో ఆసియాకు చేరవచ్చు నని నిశ్చయించెను. భూమి గుండ్రముగా నున్న దని కొలంబసునకు తెలియును. కాని యూరపు ఖండమునుండి, పడమరగా పోయినచో ఆసీయాకును యూరఫునకును మధ్య అమెరికా యున్నదని అప్పటి కెవరికిని తెలియదు. కొలంబసు, చాలమార్లు అట్లాంటికు మహాసముద్రములో ప్రయాణము చేసి కొంతదూరము పోయి తిరిగి వచ్చుచుండెను. ఒకసారి ఐస్ లాండు ద్వీపమును జేరి మరలివచ్చెను. ఇతనియొద్ద దూర ప్రయాణము చేయుటకు ద్రవ్యము లేక చాలకాల మాగవలసి వచ్చెను. తునకు స్పెయిను దేశములోని రాజపోషణవలనను,కొం దరు వర్తకులసహాయము వలనను 1492 వ సంవత్సరమున కొలం