Jump to content

పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

అయిదవ అధ్యాయము

నూరు సంవత్సరముల యుద్ధము

(1)

కాపటు
వంశపు రాజులు

హ్యూళి కాపటు 987 సం|| న పరాసుదేశమునకు రాజ గుట చూచి యున్నాము. ఫ్రాన్ సు దేశములోని ప్రజలు రాజు లను తీసి వేయువరకును ఈ కాపటు వంశ్యులే ఫ్రాన్సును పాలించిరి. మొఖా సాప్రభువరం పరాపద్ధతివలస రాజులకు పోయిన బలమును తిరిగి సంపాదించు టకు కోపటు వంశ రాజులు ప్రయత్నించిరి, కాలగమమున ప్రభు పుల బలమును తగ్గింది రాజులు నిరంకుశత్వమును పొందుటకు యత్నించిరి. రాజులు నిరంకుశులగుటకు కొన్ని శతాబ్దములు పట్టెను. 1060 సం|న మొనటి ఫిలిప్పు రాజయ్యెను. 1066 సు. న యామునకు సామంత రాజకు నార్మండ్ రాష్ట్రప్రభువు