పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
46

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

విలియము ఇంగ్లాండును జయించి యా దేశమునకు రాజయ్యెను.. 1180 సం||న పరాసు దేశమునకు రెండవ ఫిలిప్పు రాజయ్యెను. ఈయన పెక్కు యుద్ధములు చేసి తన సామంత రాజులనుండి . చాల భూములను లాగుకొని తన స్వంత భూములుగ చేసికొని మిగుల బలవంతుడయ్యెను. 1215 సం|| న జాన్ అను బలహీ సుడగు రాజు ఇంగ్లాండును పాలించుచుండెను. పరాసు రాజుకు సామంతముగ అతనికి పరాసు దేశములో నార్మండీ అంజూవిన్ రాష్ట్రములుండెను. రెండవ ఫిలిప్పురాజు ఇంగ్లీషు రాజు పై యుద్ధము చేసి యోడించి నార్మండ్ అంజూవిస్ రాష్ట్రములను స్వాధీనము పొందెను. రెండవ ఫిలిప్పురాజు పరాసు దేశము లోని అనేక పట్టణములకు స్వతంత్ర పాలనాహక్కుల నిచ్చెను. . వర్తక సంఘములు కొంతవరకు ప్రత్యేక స్వపరిపాలనా సౌక ర్యములను కలుగ జేసి ప్రోత్సహించెను. పట్టణములుసు, వర్తక మును ఎక్కువెయిన కొలదియు, ప్రభువులకు సంబంధము లేని భాగ్యవంతులయినట్టియు, తెలివి తేటలు గలిగినట్టియు, . హక్కులపై రాజుల నాశ్రయించు నట్టియు ప్రజలు పరాసు దేశమునందంతటను వృద్ధి జెందిరి. ఈపట్టణము లన్నియు సమయము వచ్చినపుడు రాజునకు పట్టుకొమ్మగా నిలిచినవి. . రెండవ ఫిలిప్పు తన నౌక రీలో నుండి ప్రభువులను తీసివేసి మధ్య మతరగతి ప్రజలనుండి నౌకరుల నేర్పఱచుకొ నెను. . పట్టణముల నుండియు వర్తకుల నుండియు కొన్నిపన్నులు వసూలు చేసెను. సామంత రాజులు తనకు జేయు కొన్ని స్వంత నౌకరీలను మాన్పించి వానికి బదులు సొమ్ము పుచ్చుకొ నెను. స్వంత