పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
44

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఈ మతయుద్ధముల వలస గిలిగిన ఫలితము లేమి? ముస ల్మానుల బలము తగ్గకపోగా వృద్ధి అయినది. ఆసియా మైనరు. పాల స్తైను, జెరూసలేము, 'మొదలగు ప్రాంతములన్నియు ముస ల్మానుల వశమందే యున్నవి. ముసల్మానులను తూర్పునుండి. యూరపు ఖండములో ప్రవేశించకుండ అరికట్టుచున్న కాన్ స్టాం టునోపిలు సామాజ్యము బలహీనమైనది. క్రైస్తవుల కేమియు లాభము గలుగలేదు. కాని యూరపులోని క్రైస్తవులు తమ ప్రభువగు నేసు క్రీస్తువలెను , ఆయన యొక్క గొప్ప శిష్యుల వలెను, ధర్మసం స్తాపనకొరకు తాము ఇతరులచే బాధల ననుభ వించు పద్ధతిని విడిచి, మతము పేర నితరుల పై కత్తిదూయు అల వాటును నేర్చుకొనిరి. మత సహనమును బొత్తుగా మరచి పోయి యితర మతస్థులను చంపి వేయు దురభ్యానముల కల వాటుపడిరి.