పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
42

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

సంధి రాయబార మంపెను. క్రైస్తవులొప్పు కొన లేదు. ఈజిప్టు నంతను జయించి సుల్తానును క్రైస్తవునిగా జేయవలెననీ వారి యాశ, సుల్తాను తెన సేనలతో క్రైస్తవుల పైకి వచ్చి వారి నోడించి డిమియాట్టాసుండి వెడలగొట్టెను. క్రైస్తవులు ఈజిస్ట్ నువదలి పారిపోయి.. 1229 సం|| సిసిలీ రాజు 'రెండవ ప్రెడ రిక్కు క్రైస్తవ సేనలతో పాలస్తీనులో ప్రవేశించెను. ఈజిప్టు సుల్తాను సంధికి వచ్చి జరూస లేముకు క్రైస్తవయాత్రికులు స్వేచ్ఛగా రాక పోకలు చేయునట్లు సంధి చేసికొనెను. ముస ల్మానులలో కొన్ని అతఃకలహములు కలిగినపుడు జెరూసలే మును క్రైస్తవులు స్వాధీనమును పొందిరి. కాని 1244 సం|| ఈజిప్టు సుల్తాను తిరిగి బలవంతుడై సిరియా, పాలస్తైను మొద లగు గా ఆసియా మైనరు ప్రాంతము. అన్నిటిని వసశపరచుకొని అక్కడ యెచటను క్రైస్తవ రాజ్యము లేకుండ చేసెను. తదాది జెరూసలేము ముసల్మానుల వశమందే యున్నది.


1235 సం॥న పరాసు దేశములో మతయుద్ధము ప్రక టింపబడెను. జేరూసలేముకు పోవుమార్గములో యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన వారివంశ్యులగు యూదుల సందరిని హత్య గావించి క్రైస్తవమతములో కొన్ని సంస్కరణములను గావింప యత్నించుచుండిన నూట యెసు బది ముగ్గురు క్రైస్తవు లను మంటలలో పడ వేసి చంపి, క్రైస్తవ సేనలు పాలస్తైనులో