పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ అధ్యాయము

43

చేరిరి. అచట గాజా వద్ద తురుష్కులచే నోడింపబడి మరలి వచ్చిరి. 1244 సం!న పరాసురాజగు 'సెంటులూయికి జబ్బు చేసెను. అపుడు తనకు వ్యాధి నెమ్మదించినచో ముస ల్మానుల పైకి యుద్ధమునకు వెళ్ళెదనని దేవునికి 'మొక్కు- కొనెను. శరము నెమ్మది అయినది. 1249 సం|| న ఆయన 1800 పడవలలో "సేనలు తీసికొని ఈజిప్టు మీదికి వెళ్ళను. గాని మహమ్మదీయులు వీరి నోడించి 'సెంటులూయిని కొన్ని సేనలతో పట్టుకొని ఖైదు జేసిరి. విశేషమగు ధనముపుచ్చుకొని విడిచి పెట్టిరి. వెంటనే పరాసురాజు పాలస్తైనుకు పోయి మూడు సం || లు యాత్రలలో గడపెను. రాజు ముసల్మానులచే పట్టుకొనబడిన సంగతి తెలియగ నే పరాసు దేశములోని ప్రభువు లూరకొనిరి. వ్యవసాయ కూలీలు, వ్యవసాయకులు మొదలగు బీదవారు సముద్రముదాటి వెళ్ళి రాజును విడిపించి తెచ్చెదమని బయలు దేరిరి గాని తోవలో వీరు పరాసు ప్రజలను దోచుకొనుటవల నను, హత్యలు గావించుటవలనను వీరిని ప్రజలు ప్రతి చోట నుండియు తరిమివేసిరి. అందువలన నేమియు చేయజూలక గృహములకు చేరిరి. సెయింటు లూయిరాజు 1254 సం|| న పరాసు దేశమునకు వచ్చెను. ఈ రాజు 1270 సం|| న మరియొక మత యుద్ధము చేయ యత్నించి ట్యూనిసు పట్టణము పై దండెత్తి అచట తన సైనికులతో గూడ ప్లేగువలన మరణించెను.