పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ఆధ్యాయము

41

చేసిరి. కొంత భాగమును వెనీసు వారికిచ్చిరి. ఈవిధముగా ముసల్మానుల పై యుద్ధముకొరకు బయలు దేరిస క్రైస్తవ సేనలు క్రైస్తవ పట్టణమగు జారాను ముట్టడించి క్రైస్తవ రాజ్యమగు కాన్ స్టాంటినోపింలును మిగులబలహీనముగ గావించిరి. క్రైస్తవ ప్రజలను దోచుకొని వధంచిరి. కాన్ స్టాంటునోపిలులో వీరు స్థాపించిన కొత్త చక్ర వర్తిని రాజ్యములోని చాలభాగము లంగీక రించక స్వతంత్ర మును ప్రకటించెను. ఈ తొత్తచక్రపర్తి యొక్క వంశమువారు మిగుల బలహీనులై 8. 1262 సం! న నీవంశముపై ప్రజలు తిరుగుబాటు జేసి తిరిగి గ్రీకువంశమును నిలు వబెట్టిరి. కాని స్టాంటునో పిలు తన పూర్వబలమును కోలుకొనలేదు. తుదకు ముసల్మానుల స్వాధీన మాయెను.

4

తర్వాత
యుద్ధములు

.

తర్వాత 'పోపులు' ఇంకను కొన్ని దండయాత్రలు సలిపిరి, ముసల్మానుల పైకి అయినను గాకున్నను “పోపులు” మతము పేర జరుపు దండయాతలకన్నిటికిని క్రైస్తవమత యుద్ధములనియే పేరిడిరి. 1218 సం| ఈజిప్టు లోని ముసల్మాను రాజు పై యుద్ధము ప్రకటింపబడెను. " పోవు” యొక్క ప్రతినిధి యే స్వయముగా క్రైస్తవులను 'నైలు” సది ముఖ ద్వారయుననున్న డెమియ ట్టాను క్రైస్తవులు జయించిన. దానిని తనకు విడిచి పెట్టిన చో జెజూసలేమును క్రైస్తవుల వశము చేసెదనని ఈజిప్టు సుల్తాను