పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
40


ప్రెంచి స్వాతంత్య విజయము

పడవలు కావలెనని కోరగ, క్రైస్త భక్తులగు సేనలన్నియు ముందుగా తమకు శత్రువగు జారా పట్టణమును ముట్టడించి నచో పడవల నిచ్చిదమని వెనీసు ప్రభుత్వమువారు చెప్పిరి.. క్రైస్తవ సేన యొప్పుకొనెను. వెనీసువారును క్రైస్తవ సేనలును పడవలలో వెడలి క్రైస్తవ ప్రజలదగు జారాను ముట్టడించిరి. జురాను జయించి వెనీసు వారివశము చేసిరి. ఇక్కడనుండి యైన క్రైస్తవ సేనలు ముసల్మానుల పైకి పోలేదు.కాన్ స్టాంటి నోపిలు చకప యొక్క అన్న కుమారుడగు అలెక్సియసు జారాకు వచ్చి, తనకు తండ్రి నుండి సంక్ర మించిన రాజ్యము సక్రమముగా తన పినతండ్రి అపహరించెను గావున తనకు సహాయ ము చేయ వలసినదని కోరెను. కాన్ స్టాంటినోపిలుకూడ వెనీసుసకు వర్తకములో పోటీగ నున్నది. వెనీసువారి ప్రోత్సా, హముస క్రైస్తవ సేనలు ముసల్మానులను యూరపులో ప్రవే శింపకుండ చిరకాలము నుండి ఆవుచున్న ప్రధాన క్రైస్తవ రాజ్యమగు కాన్ స్టాంటి నోపిలు పై దండెత్తిరి. అచట రాజ్య మేలుచున్న' చక్రవర్తి నోడించి అల్మే యసును చక్రవ ర్తిగా చేసిరి. కాని త్వరలోనే అచటి ప్రజలు తిరుగబడి అలెక్షి య సుసు చంపి వేసిరి. దీనిమీద క్రైస్తవ సైనికులు కాన్ స్టాంటి నోపిలు ప్రజలను ముట్టడించి వారిని దోచుకొని ఘోర హత్యలపాలు చేసిరి. వచ్చిన క్రైస్తవ సైనికుల నాయ కులలో నొకడగు పరాసుప్రభువు బాల్డ్విమును చనర్తిగా