పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

247


పదునాఱవ అధ్యాయము


పూరిగా పూర్తిగా వశ మయ్యెను. రాబిస్పీయరు. అతివాదులలో ముఖ్యు డు. బారి, సెంటు జస్టు లీయనకు శిష్యులు. కార్నటు యుద్ధ మంత్రిగ నుండెను. వీరికి ప్రజాసమూహములలోను, క్లబ్బులలోను పలుకుబడి యుండెను. జాతీయ ప్రభుత్వమువారు క్రైస్తవ పంచాంగమును తీసి వేసి విప్లవపంచాంగము నేర్పర చిరి. పెంచి తీయప్రభుత్వ ముసకును క్రైస్తవమతమునకు నెట్టి సుబుధము లేదని తీర్మానించిరి. మొదటి సంవత్సరము ఏసుక్రీ స్తు ప్రభువు పుట్టినదినము నుండి ప్రారంభించుటకు మారుగ, ఫ్రెంచి ప్రజలు పూర్తిగా స్వతంత్యమును పొందిన ఫ్రెంచిప్ర జాస్వామ్యమే (రిపబ్లికు) ఏర్పడినప్పటినుండియు పాకంభము కావ లెనని శాసించిరి. ఇందువలస ఫ్రెంచి (రిపబ్లికు) ప్రజ స్వామ్య 'మేర్పడిన క్రీస్తుశకము 1702 వ సంవత్సరము సెప్టెంబరు 22 వ తేదీ నుండియు 'ఫ్రెంచి శకము ప్రారంభము చేయ బడినది. సంవత్సరము ముప్పది దినములుగల పండ్రెండు నెలలుగా భాగించబడును. "నెలలకు జనవరి మొదలగు క్రైస్తవనామ మటను తీసి వేసి క్రొత్త నామముల నిచ్చిరి. మూడు వందల అరువది రోజులకు పైగ నుస్ను అయిదు రోజులను జాతీయ పండుగలుగ నేర్పరచబడెను. ఒక దినము ప్రతిభ (బుద్ధి సూక్ష్మత)యొక్క పండుగ. రెండాదినము కాయ కష్టము యొక్క పండుగ. మూడవ దినము సత్కర్మలయొక్క పండగ. నాలుగవ దినము ఫలముల ననుభ వించుటేఅను గూర్చిన (సత్కర్మలు చేసిన మంచి ఫలముల ననుభవించుట) పండగ. అయిదవ దినము ఉత్కృష్టమైన భావముల పండుగ. ఈ అయిదు పండుగలను ప్రెంచి