పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
248

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

జాతి సలుప వలసిన జాతీయపండుగలని శాసించబడెను. ప్రతి నెలకును మూడు వారములుండును. వారము నకు పదిరోజులుం డును. పదియవదినము విశ్రాంతి దినము. ఆదినమున కచ్చే రీలును దుకాణములును మూయబడును. వారములోని దిన ముల పేర్లు కూడ మార్చుబను.

యుద్ధముకై
సంసిద్ధమగుట,

శత్రుమండలిగా నేర్పడిన యూరపు రాజుల పైకి తగిన సైన్యములను బంపుటకు దేశ సంరక్షక సంఘము వారు గట్టి ప్రయత్నములను చేసిరి, “ప్రతి పౌరుడును తా సనుభవించదలచిన స్వతంతరము యొక్క రుణ మును తీర్చుకొనవలసి -యున్నాడు. స్వతంత్ర మును సంరక్షించుటకు దేశములోని వయస్సు యొక్క విచక్షత లేకుండ స్త్రీ పురుషులందరును కృషిసలుప వలెను. యువకులు యుద్ధములో పోరాడుటకు బోవలెను. వివాహితులైన పురుషులు ఆయుధములు తయారు చేయుట ను, ఫిరంగులను సామానులను ఒక చోటునుండి మరియెక చోటికి చేర్చుటలోను తోడ్పడివలెను. మరియు నాహార సామగ్రులను తయారు చేయవలెను. స్త్రీలు డేరాలను సైనిక దుస్తులను తయారు చేయవలెమ. కొందరు స్త్రీలు గాయ ములు తగిలిన వారికి చికిత్సలు చేయవలెను. పిల్లలుగూడ దూది మొదలయినవి తీయవలెను, వృద్ధులైన వారు బహిరంగ స్థలముల లోనికి తీసికొనిపోబడి రాజులయందు ద్వేషమును, ప్రజా స్వామ్య ముసం దాసక్తిని బోధించి పడుచు వారిని సైనికులుగా చేరునట్లు పురికొల్పవలెను. ప్రతివారి యుద్దనున్న ఆయుధములను