పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
246

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

ప్యారిసులో సమావేశమై దీని నంగీక రించిరి. "నిరంకుశత్వ మును నిర్మూలించెదము. లేని యెడల నశించెదము,” ఆసు ప్ర 'మాణము నందరును గైకొనిరి..

దేశోపయుక్త
కార్యములు

జాతీయసభ వారు 'దేశము కష్టస్థితియం దుండగనే దేశోపయోగకరమగు పెక్కు కార్యములను చేసిరి. విద్యను, వ్యవసాయమును అభివృద్ధి చేయుటకును, నీళ్ళు నిలిచెడి ప్రదేశమ్ములోని నీళ్ళను తీయించి వ్యవసాయము సకు అర్హముగా చేయుటకును, ముసలి వారికిని, తల్లిదండ్రులు లేని పిల్లలకును సహాయము చేయుటకును తీర్మానించిరి. ఎక్కువ స్పష్టమగు నట్టియు చిక్కులు లేనట్టియు సివిల్ కోడ్డుసు, ధర్మస్మృతిని తయారు చేసిరి . నీగ్రోలను "బానిసలుగ పట్టకొనుట మానిచి వేసిరి. ఫ్రాన్సు దేశపు వలసరాజ్యము లలోని నల్లజాతులవారి కందరకును ఫ్రెంచివారితో సమానముగ పౌర సత్వపు హక్కుల నిచ్చి . నిర్బంధముగ ఉచిత ప్రారంబభ విద్యను నెలకొలిపిరి. మతవిద్యను పాఠశాలలో గరపగూడదని. ప్యారిసు పట్టణము లో మూడు వైద్య విద్యాలయములను, నొక ప్రకృతి శాస్త్రము శోధనాలయమును, నొక సంగీతవిద్యా శాలను స్థాపించిరి .


కొత్తపంచాంగము,

జూతీయసభ వారి చే మూడు నెల కొకమారు దేశ సంరక్షక సంఘ మెన్నుకొన బడు చుండెను. ఈ దేశ సంరక్షక సంఘమే యావత్తు ప్రభుత్వము యొక్కయు కార్యనిర్వాహక వర్గ మయ్యెను. జాతీయసభ యు, దేశ సంరక్షక సంఘమును అతివాదులకు