పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

ఫ్రెంచి స్వాతంత్య విజయము


గిరాండిస్టు కక్షి
పడిపోవుట

సెప్టెంబరు నెలలో హత్యలుగావించిన కొందరిని విచా రించుటకు గిరాండిస్టులు ప్రారంభించగా సతివాదుల విచారణ కూడదని యాపిరి. రాజుసు రక్షింప యత్నించి నందుకు గిరాండిస్టులను ఆతీనాదులు క్లబ్బులలోతీవ్రముగా ఖండించిరి. వర్తకులు సరుకులమ్మక దాచుకొనగా ధరలు పెరిగినందున ప్రజలు వెళ్లి దోచుకొనిరి. ఇది అతివాద నాయకుడగు మారటు సలహామీద జరిగినదని గిరాండిస్టులు జాతీయసభలో కఠినముగా విమర్శించిరి.


ఇంతవరకును మంఫ్రెంచి సేనలను నడిపిన డ్యూమరో సేనాని లూయరాజుమరణమునకు చింతించి నూతన ప్రభుత్వమునకు వ్యతిరేకుఁ డయ్యెను. ప్యారిసు మీదికి పోయి తిరిగి రాజరికమును స్థాపించ నుద్దేశించెను. ఆస్ట్రియా సేనా పతితో కుట్రలు సలిపి. తన స్వాధీనములోని కొన్ని కోటలను ఆస్ట్రియా వారికి వశము చేసెను. కాని ఆయన క్రిందనున్న నేతలు ఆయనతోకూడ శత్రువులతో చేరుటకు సమ్మతించలేదు. డ్యూమరో సేనానిని జూతీయ ప్రభుత్వము వారు సేనాధిపత్యమునుండి తొలగించిరి. ఆయనయు మరి యిద్దరు సేనానులును మాత్రము లేచిపోయి శత్రువులతో చేగిరి. ఆయస క్రిందనున్న 'సేనలన్నియు ఫామర్సు కువచ్చి మురియొక సేనాధిపతి కిందనున్న మిగిలిన పరాసు సైన్య ములతో చేరెను. డ్యూమరొ గిరాండిస్టుల కక్షీకి చెందియుం డెను. ఆయన యొక్క కుట్రలో మిగిలిన గిరాండిస్టులును గల