పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునారవ అధ్యాయము

గలుతో సంథి. ఇన్ని సంధులను ఇంగ్లాడు ప్రత్యేకముగా చేసికొనెను. ఇంతేగాక ఇంగ్లాడు యుద్ధవ్యయము భరిం చునట్లును ఆయాప్రభువులు సైన్యములను బంపి ఫ్రాస్సు మీద పడునట్లును, ఏప్రిలు 10 ఏ తేదీన 'హస్సి కాసిలు ప్రభువుతోను, ఏప్రిలు 25 వ తేదీన సార్డినియాప్రభుత్వము తోసు సెప్టెంబరు 21 వ తేదీన 'బే డెన్ ప్రభువుతోసు, యొడంబడికలు చేసికొనెను. ఆస్ట్రియాకును ప్రష్యాకును యుద్ధ వ్యయమునకై ఇంగ్లాండు చాల ధనమిచ్చెను. ఈ విధముగా నింగ్లాండు ఫ్రెంచి జాతి యొక్క స్వయంనిర్ణయమునకు బద్ద శత్రు వై యుద్ధము నడిపినది.

ఇంత మంది శత్రువులు ఫాస్సు యొక్క అన్ని సరి హద్దులను ఒక్కసారి వేలకొలది సైన్యములతో ముట్టడించెదరు.. ఫ్రెంచి జాతీయసభవారు సరిహద్దుల నన్ని వైపులను కాపాడు కొనుటకు వెంటనే మూడు లక్షల సైన్యములను తయారు చేసిరి. ఏప్రిలు 6 వ తేదీన యుద్ధమును జయప్రథమముగా సడుపుటకై . పండ్రెండు మందిగల (కమిటీ ఆఫ్ పబ్లిక్ సేప్టి). దేశ సంరక్షణ సంఘము నొక దానిని నేర్పరచిరి. దేశములోపల జాతీయ ప్రభుత్వమునకు వ్యతి రేకులని యనుమానిం పబడినవారిని పట్టుకొనుటకు పండ్రెండుమందిగల దేశపుకాపుదల సంఘము (కమిటీ ఆఫ్ జనరల్ సెక్యూరిటీ) నొక దానిని స్థాపించిరి. వీరు పంపిన వారిని విచారించి శిక్షించుట కొక విప్లవ న్యాయస్థానము నేర్పరచిరి.