పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

పదునాఱవ అధ్యాయము

రని యతివాదులు నిందలు మోపిరి. ప్యారిసు ప్రజల సహాయ మున గిరాండిస్టులను జాతీయసభ నుండి వెడల గొట్టవలెనని యతివాదు లాలోచించు చుండిరి. గిరాండిస్టు లతివాద నాయకు డగు మారటు మీద వర్తకులను దోయించి నాడను నేరా రోపణ చేసి నూతన విప్లవ న్యాయస్థానమునకు విచారణకు బంపిరి. ప్యారిసు పట్టణము లోను క్లబ్బులలోను గొప్ప యాందోళనము కలిగెను. ప్యారిసుపుర పాలకాధ్యక్షుడు వెంటనే గిరాండిస్టు ముఖ్యులను జాతీయసభ నుండి రాజీనానూ నిచ్చి పోవ లెనని ప్యారిసు పురపాలక సుఘము తరఫున కోరెను. మా రటు మీద కేసు కొట్టి వేయబడెను. మారటును ప్యారిసుప్రజ లూరేగించిరి. జేకొబినుల పక్షమువారు. జాతీయ సభను చూడ వెళ్లి కూర్చొని గిరాండిస్టులు మాట్లడుచున్నఫు డల్లరిచేయుచుం డిరి. ప్యారిసు మ్యునిసిపాలిటీ యొక్క ప్రవర్తనను విచారించుట కొక కమిటీని గిరౌండిస్టులు నియమించిరి. వీరి విచారణమూ లమున మ్యునిసిపలు సభ్యులకు చాల భయముక లిగెను. 'మే 22 వ తేదీని అమలుజరుప సున్న మరియొక కుట్ర గలదని తేలెను. మ్యునిసిపలు సంఘములో చేరిన హెబర్టును, మరి కొందరిని కుట్ర క్రింద పట్టుకొనిరి. అతివాదులు, జెకోబినులు, మ్యూనిసిపలు సభ్యులు ప్రజలలో సుద్రేకమును ఫుట్టించిరి. ఈ విచారణను సంఘము వారు జాతీయ సభలో యుండిన యతివాదుల సందరును ఖయిదు చేసి గిరాండిస్టుల నిరంకుశత్వమును స్థాపించెద రను నపోహ ప్యారిసు ప్రజలలో కలిగెను. మే 27 వ తేదీన ప్యా రిసుపుర పాలక సంఘమువారు హేబర్టు మొదలగువారిని విడుదల చేయ